బిజినెస్

ఆసియన్ మార్కెట్లకు మిశ్రమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌కాంగ్, ఫిబ్రవరి 1: అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధానికి స్వస్థి పలికేందుకు ఇరు దేశాలూ సాగిస్తున్న చర్చలు శుక్రవారం సైతం ఓ కొలిక్కి రాలేదు. ఎలాంటి ఒప్పందాలూ జరకుండానే ఈ చర్చలు ముగిశాయి. ఈ శిఖరాగ్ర చర్చలు తదుపరి కూడా కొనసాగించాలని ఇరుదేశాలూ తీర్మానించాయి. ఈక్రమంలో ఇనె్వస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఆసియన్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలనే అందుకున్నాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ చర్చలు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చర్చల్లో ‘అద్భుత ప్రగతి జరిగింద’ని వ్యాఖ్యానించారు. ఐతే ఈ రెండు అతిపెద్ద ఆర్థిక శక్తుల మధ్య చర్చలకు మార్చి 1 మాత్రమే డెడ్‌లైన్ అన్న విషయాన్ని మరువరాదన్నారు. అమెరికాలో అమ్మకాలు జరిగే చైనాకు చెందిన అనేక వస్తువులపై బిలియన్ల డాలర్ల కొద్దీ సుంకాన్ని విధించేందుకు అప్పటి వరకు గడువుఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే చైనా రాజధాని బీజింగ్ సైతం దీనిపై స్పందిస్తూ ‘చర్చలు విస్పష్టంగా, ఫలవంతంగా సాగుతున్నాయ’ని వ్యాఖ్యానించింది. మేధోసంపత్తి (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) విషయంలో పరస్పర సహకారానికి అంగీకారం కుదిరిందని పేర్కొంది. అలాగే అమెరికా వస్తువుల దిగుమతికి సైతం ఒప్పందం కుదిరిందని స్పష్టం చేసింది. ఈ అంశాలపైనే ట్రంప్ ప్రధానంగా చైనాపై గుర్రుగా ఉన్నారు. ఈనెలలో త్వరలో అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బీజింగ్‌ను సందర్శిస్తారని, తదుపరి ఈ చర్చలకు ముగింపుగా తాను చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌ను కలుస్తానని ట్రంప్ చెప్పారు. ఇలావుండగా శుక్రవారం చర్చలు ముగిసిన అనంతరం ఒయాండాకు చెందిన సీనియర్ మార్కెట్ విశే్లషకుడు జఫ్రీ హేల్లీ మాట్లాడుతూ ఈ చర్చలపై ఎలాంటి తుదినిర్ణయాలూ జరగలేదన్న అంశం మార్కెట్ సెంటిమెంటుపై ప్రభావం చూపుతోందన్నారు. తొలుత సానుకూలంగా మొదలైన ఆసియన్ మార్కెట్లు వృద్ధిని నమోదు చేసినప్పటికీ తదుపరి మిశ్రమ ఫలితాలతోనే ముగిశాయన్నారు. టోక్యో మార్కెట్లు 0.1 శాతం అదనపులాభాలు సంతరించుకోగా హాంగ్‌కాంగ్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. షాంఘాయ్ మార్కెట్లు మాత్రం సంతృప్తికరమైన 1.3 శాతం లాభాల వృద్ధిని నమోదు చేశాయి. పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిబంధనలను అమెరికా-చైనా సరళతరం చేయడం పట్ల షాంఘాయ్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీతోబాటు సింగపూర్ మార్కెట్లు మాత్రం ఎలాంటి హెచ్చుతగ్గులూ లేకుండా ప్లాట్‌గా మిగిలాయి. అలాగే సియోల్ మార్కెట్ సూచీలు 0.1 శాతం నష్టపోయాయి. ఇక మనీలా, ముంబయి, బ్యాంక్‌కాక్, జకార్తా మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. కాగా ఉదయం ట్రేడింగ్ ఊపందుకోవడంతో లండన్ మార్కెట్లు 0.3 శాతం, ఫ్రాంక్‌ఫర్ట్, ప్యారిస్‌లు 0.2 శాతం వృద్ధి చెందాయి. ఇరు దేశాల ప్రకటనలు మార్కెట్లకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని, ఐతే దీర్ఘకాలికంగా సాగుతున్న మరికొన్ని వివాదాస్పద అంశాలపై తుదినిర్ణయం జరిగేవరకు గందరగోళం తప్పదని కార్నెల్ యూనిర్శిటీకి చెందిన వాణిజ్య పాలసీ విభాగం ప్రొఫెసర్ ఈశ్వర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.