బిజినెస్

బీఎస్‌ఈ సరికొత్త యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రభుత్వం నిర్వహించే వేలం పాటల్లో రీటైల్ ఇనె్వస్టర్లు నేరుగా పాల్గొనేందుకు వీలుగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల విషయంలో సహాయకారిగా ఉండేందుకు బీఎస్‌ఈ సరికొత్త యాప్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు బీఎస్‌ఈ రిజిస్ట్రర్ట్ వ్యాపార సభ్యుడి సహాయంతోనే రీటైల్ ఇనె్వస్టర్లు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉండే ది. ఇకపై బీఎస్‌ఈ యాప్ సాయంతో వీరు నేరు గా వేలంలో పాల్గొన వచ్చని ఆ స్టాక్ ఎక్చేంజ్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మూలధన మార్కెట్‌లోట్రెజరీ బిల్లుల డ్రేడింగ్ (టీ-బిల్స్) ను ఎక్చేంజ్ పర్యవేక్షిస్తుంది. సెంకడరీ మార్కెట్‌లో టీ బిల్లుల ట్రేడింగ్ వల్ల తమకు లాభదాయకంగా లేని ఫార్మేట్ల నుంచి ఇనె్వస్టర్లు వైదొలిగేందుకు వీలుకలుగుతుందని బీఎస్‌ఈ తెలిపిం ది. కాగా గత నెలలో బీఎస్‌ఈ-డైరెక్ట్‌ను బీఎస్ ఈ ఆవిష్కరించింది. ఇది ఇనె్వస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో(జీ-సెక్‌లు) ఆన్‌లైన్ బిడ్డింగ్, బిల్లులకు అనువుగా ఉంది. ఈ వేదిక ద్వారా వినియోగదారుడికి స్నేహపూర్వక వాతావరణంతోబాటు 24 ఇంటు 7 బిడ్డింగ్‌కు వీలవుతుంది. అలాగే పె ట్టుబడిదారుల నుంచి బిడ్డింగులను తీసుకునేందుకు సైతం దోహదం చేస్తోంది. అలాగే ఇనె్వస్ట ర్లు తమ బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా ఎ క్స్చేంజికి ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చెల్లింపులు చేసి, సెక్యూరిటీలను తమకు నష్టం కలిగించే అకౌంట్ల ముందస్తు కేటాయింపుల నుంచి తీసుకునేందుకు వీలుంటుంది. సాధారణంగా ప్రభు త్వ సెక్యూరిటీలు రిస్క్ లేని పెట్టుబడులకు, స్వల్ప, దీర్ఘకాల ఆదాయాలకు వీలుకల్పిస్తాయి.