బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ వస్తూత్పత్తి విభాగంలో కొత్తగా మూడు సరఫరా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వస్తూత్పత్తి విభాగంలో దేశంలో మూడు సరికొత్త సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) తెలిపింది. ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పాన్ ఇండియా సరఫరా వ్యవస్థను మరింత సౌకర్యవంతం చేయడంలో భాగంగా ఈ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ గురువారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో బులియన్ కాంట్రాక్టులకు సంబంధించిన సెటిల్మెంట్ విభాగంలో అహ్మదాబాద్‌ను మాత్రమే ప్రధాన సరఫరా కేంద్రంగా పరిగణించేవారు. కాగా కొత్తగా మూడు సరఫరా కేంద్రాలను జనవరి 25న ప్రారంభించినట్టు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. సరఫరాకు, వినిమయానికి మధ్య ఉన్న దూరాన్ని భర్తీచేసే వారధిలా పనిచేసే ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, వివిధ ప్రాంతాల్లో వినిమయ వస్తువుల సరఫరాను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు ఈ సరఫరా కేంద్రాలు దోహదం చేస్తాయని, ఆయా ప్రాంతాల్లోని నియంత్రిత ధరను సైతం కల్పిస్తాయని ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రవి వారణాసి తెలిపారు.