బిజినెస్

స్టాక్ మార్కెట్‌లో సానుకూలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 1: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కట్‌లో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. నష్టాలు తప్పవేమోనన్న అనుమానాలతో మొదలైన ట్రేడింగ్ చివరికి 212.74 పాయింట్లు పెరిగి, 36,469.43 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62.70 పాయింట్లు పెరగడంతో 10,893.65 పాయింట్లకు చేరింది. మార్కెట్‌లో లావాదేవీలు మొదలైప్పుడు వివిధ కంపెనీల షేర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా సెనె్సక్స్ 500 పాయింట్లకుపైగా ర్యాలీని కొనసాగించింది. కానీ, మధ్యంతర బడ్జెట్‌లోని అంశాలు తెలుస్తున్న కొద్దీ అమ్మకాల జోరు పెరిగింది. దీనితో సాయంత్రానికి స్టాక్ మార్కెట్ పతనం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, క్రమంగా కోలుకున్న మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటోమొబైల్‌తోపాటు వినియోగ వస్తువుల కంపెనీలకు చెందిన వాటాలు లాభాల్లో ట్రేడయ్యాయి. పన్ను ఆదాయ పరిమితిని గోయల్ రెట్టింపు చేస్తూ, ఐదు లక్షల రూపాయలుగా ప్రకటించడంతో, స్టాండర్డ్ డిడక్షన్ 40,000 నుంచి 50,000 రూపాయలకు పెరిగింది. ఈ ప్రతిపాదన 2019-20 ఆర్థిక సంవత్సరంలో, దేశ వ్యాప్తంగా కనీసం మూడు కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూర్చనుంది. ముందుగా ఊహించిన విధంగానే రైతులకు గోయల్ పెద్దపీట వేశారు. ప్రధాన మంత్రి కిసార్ సమ్మాన్ నిధి కింద ఏటా 6,000 రూపాయల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పలు పలు సంక్షేప పథాలను ప్రకటిస్తుందని తెలిసినప్పటికీ, మధ్యంతర బడ్జెట్ వల్ల మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం కనిపించకపోవడం విశేషం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటు ఉంటుందని గోయల్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది కొంత వరకూ తగ్గి, 3.3 శాతంగా నమోదవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల వల్ల ద్రవ్య లబ్ధత పెరుగుతుందని అన్నారు. కాగా, మధ్యంతర బడ్జెట్ పట్ల వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ఎక్కువ శాతం మంది సానుకూలంగా స్పందించడం విశేషం. మొత్తం మీద మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలోనూ స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ధోరణులు కనిపించలేదు. ముంబయి స్టాక్ ఎక్ఛ్సేం జ్ (బీఎస్‌ఈ)లో జరిగిన లావాదేవీల్లో హీరో మో టార్స్ (7.48 శాతం), మారుతీ సుజికీ (4.96 శా తం), హెచ్‌సీఎల్ టెక్ (3.86 శాతం), ఏషియన్ పెయింట్స్ (3.14 శాతం), బజాజ్ ఫైనాన్స్ (2.23 శాతం) వాటాలు లాభపడ్డాయి. వేదాంత దారుణం గా నష్టపోయింది. ఈ కంపెనీ షేర్లు 17.82 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎస్ బ్యాంక్ 4.45 శా తం, ఎస్‌బీఐ 3.08, ఐసీఐసీఐ బ్యాంక్ 2.68 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.91 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అదేవిధంగా నిఫ్టీ పెరుగుదలలో హీ రో మోటార్స్ 7.54, మారుతీ సుజికీ 4.35 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.62 శాతం, ఇచర్ మోటార్స్ 3.60 శాతం, డాక్టర్ రెడ్డీస్ 3.32 శాతం లాభాలను సంపాదించాయి. కాగా, వేదాంత షేర్ల జాతీయ స్టాక్ ఎ క్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ పతనం తప్పలేదు. ఈ కంపెనీ వాటాలు 18.12 శాతం నష్టాల్లో ట్రేడ్ అ య్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 7.26 శాతం, ఎస్ బ్యాంక్ 4.53 శాతం, ఎస్‌బీఐ 3.76 శాతం, ఐసీఐసీ ఐ బ్యాంక్ 3.05 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి.