బిజినెస్

4 శాతం అమ్మకాలు పెరిగిన టీవీఎస్ మోటార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: టీవీఎస్ మోటార్ కంపెనీ జనవరి నెలలో తమ వాహనాల విక్రయం ద్వారా 4 శాతం అభివృద్ధి సాధించింది. ఈ ఏడాది ప్రథమార్థంలోని ఒక నెల కాలంలో మొత్తం 2,82,630 యూనిట్లను విక్రయించింది. అదే గత ఏడాది ఇదే నెలలో 2,71,801 యూనిట్ల విక్రయాలు జరిపినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టీవీఎస్‌లోని మొత్తం అన్నిరకాల ద్విచక్ర వాహనాల విభాగంలో 2 శాతం అంటే 2,69,277 యూనిట్ల విక్రయాలు జరపగా, 2018 జనవరిలో 2,62,995 యూనిట్లు విక్రయించినట్టు పేర్కొంది. డొమెస్టిక్ టూవీలర్ అమ్మకాల్లో జనవరి నెలలో 2,28,654 యూనిట్లు విక్రయం కాగా, 2018 జనవరిలో 2,26,992 యూనిట్లు విక్రయించినట్టు తెలిపింది. అదేవిధంగా స్కూటర్ అమ్మకాల్లో ఈ ఏడాది జనవరిలో 85,299 యూనిట్లు విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 85,521 యూనిట్లు విక్రయించినట్టు తెలిపింది. మోటార్ సైకిళ్ల విభాగంలో 13 శాతం అభివృద్ధి సాధించినట్టు టీవీఎస్ సంస్థ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో 1,11,253 యూనిట్ల మోటార్ సైకిళ్లు విక్రయించగా, గత ఏడాది జనవరిలో 98,649 యూనిట్లు విక్రయించినట్టు తెలిపింది. ఇక త్రీ వీలర్ అమ్మకాల విభాగంలో ఈ ఏడాది జనవరిలో 52 శాతంతో 13,353 యూనిట్లు విక్రయించగా, గత ఏడాది జనవరిలో 8,806 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు పేర్కొంది.