బిజినెస్

గోవాలో రూ.268 కోట్లతో ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గోవాలో 267.81 కోట్ల రూపాయల ఖర్చుతో ఆయుర్వేద, నేచురోపతి ఆసుపత్రి నిర్మాణం జరుగనుం ది. ఇందుకు ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బీసీసీ ముందుకు వచ్చింది. ఈ భారీ ఆసుపత్రి నిర్మాణానికి వీలుగా ఎన్‌బీసీసీ ఆయుష్ మం త్రిత్వ శాఖతో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 50 ఎకరాల్లో చేపట్టనున్న ఈ అధునాతన ఆసుపత్రిని వచ్చే 24 నెలల కాలంలో పూర్తి చేయనున్నామని ఎన్‌బీసీసీ కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి కోర్సులు అభ్యసించే 500 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇక్కడ అం డర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ డిగ్రీలు చేసే అవకాశం ఉం ది. ఈ సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు హాస్టల్ వసతీ ఉంటుం ది. 67 గదులను వైద్యుల కోసం, 91 గదులను 182 మంది విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మొత్తం రెండు విభాగాలుగా నిర్మించే ఈ ఆసుపత్రిలో 100 పడకల విభాగాన్ని ఆయుర్వేద, 150 బెడ్‌ల విభాగాన్ని నేచురోపతి కోసం కేటాయించనున్నారు. యోగా విభాగానికి సంబంధించిన సెంటర్‌లో డయాబెటిక్ క్లినిక్, కార్డియాక్ కేర్ యూనిట్, ప్రత్యేక యోగా థెరపీ రూమ్‌ను నిర్మిస్తున్నారు. ఇం దులో 30 మంది రోగులకు ఒకేసారి చికిత్స అందించే వీలుంటుం ది. ఈ సందర్భంగా ఎన్‌బీసీసీ సీఎండీ అనూప్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ తమ కంపెనీ ఈఎస్‌ఐసీ ఆసుపత్రులు, మెడికల్ కా లేజీలు, ఆసుపత్రులు వంటి ఎన్నో నిర్మాణాలను రాష్ట్రంలోని వివి ధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిందన్నారు. గతంలో హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్‌గా వ్యవహరిస్తూ ఇపుడు హెచ్‌ఎస్‌సీసీ గా మారిన సంస్థను తాము ఇటీవల కొనుగోలు చేశామని, హెల్త్‌కే ర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నామన్నారు.