బిజినెస్

కుదుటపడిన మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 2: అనారోగ్య కారణంగా వైద్య పరీక్షలు, చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్ జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ భారత స్టాక్ మార్కెట్‌పై చెప్పుకోదగిన ప్రతికూల ప్రభావాన్ని చూపలేదనే చెప్పాలి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ పాయింట్లు పెరగడమే ఇందుకు కారణం. సగటున సెనె్సక్స్, నిఫ్టీ ఒక శాతం బలపడడం మార్కెట్ కుదుటపడుతున్నదన్న వాదనకు బలాన్నిస్తున్నది. ముడి చమురు ధర పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంతర్జాతీయ అంశాలు సహజంగానే భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణాలతోనే కొన్ని నెలలుగా మార్కెట్‌లో అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ అంశాలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న కారణంగా మార్కెట్ నిలదొక్కుకుంటున్నది. అయితే, ఇది ఎంత కాలం కొనసాగుతుందనేదే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం స్టాక్ మార్కెట్ తీవ్ర ప్రకంపనలను నుంచి బయటపడి, నిలదక్కొకునే అవకాశాలున్నాయనే చెప్పాలి. గత వారంతో పోలిస్తే, ఈవారం రూపయి మారకం విలువ స్వల్పంగా తగ్గింది. డాలర్ విలువ 71.18 రూపాయల నుంచి 71.24 రూపాయలకు పెరిగింది. వారం ప్రారంభంలో బలహీనమైన సూచీలతో నిరాశా జనకంగా ట్రేడింగ్ మొదలైనప్పటికీ, ఆతర్వాత క్రమంగా పుంజుకుంది. సెనె్సక్స్ 1.23 శాతం లేదా 443.89 పాయింట్లు పెరిగి, 36,469.43 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 1.04 శాతం లేదా 113.1 పాయింట్లు పెరగడంతో, 10,893.65 పాయింట్లకు పెరిగింది. షేర్ల లావాదేవీలు సానుకూల పరిస్థితుల్లోనే కొనసాగాయి. బీఎస్‌ఈలో భారీ, మధ్య, చిన్నతరహా కంపెనీల షేర్ల అమ్మకాలను పరిశీలిస్తే, కొన్ని సంస్థలు అనుకోని లాభాలను ఆర్జిస్తే, మరికొన్ని నష్టాలను చవిచూశాయి. లార్జ్ క్యాప్‌లో లాభపడిన కంపెనీల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (11.63 శాతం), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (7.49 శాతం), యాక్సిస్ బ్యాంక్ (7.29 శాతం), మారుతీ సుజికీ (6.76 శాతం), ఏషియన్ పెయింట్స్ (6.18 శాతం) ఉన్నాయి. వెదాంత భారీగా (16.75 శాతం) నష్టపోయింది. ఎస్ బ్యాంక్ (15.48 శాతం), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషనల్ ఎకానమిక్ జోన్ (9.50 శాతం), గాడ్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (8.85 శాతం), మదర్సన్ సమీ సిస్టమ్స్ (7.82 శాతం) కంపెనీల వాటాలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. మిడ్ క్యాప్ విషయానికి వస్తే, ఎంఫసిస్ (9.58 శాతం), ఇండియన్ హోటల్స్ కంపెనీ (6.91 శాతం), బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ (6.48 శాతం), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (5.90 శాతం), పేజ్ ఇండస్ట్రీస్ (5.75 శాతం) లాభాలను ఆర్జించాయి. నష్టపోయిన కంపెనీల్లో అజంతా పార్మా (12.86 శాతం), మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (12.41 శాతం), అదానీ పవర్ (10.34 శాతం), రిలయన్స్ కేపిటల్ (9.56 శతం), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (9.15 శాతం) ఉన్నాయి. స్మాల్ క్యాప్ కంపెనీల్లో టాన్లా సొల్యుషన్స్ (18.61 శాతం), ఉత్తమ్ గల్వా స్టీల్ (16.34 శాతం), సుప్రీం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా (14.91 శాతం), ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ (13.40 శాతం), జూబిలియంట్ ఫుడ్‌వర్క్ (13.13 శాతం) లాభాల బాట ప ట్టాయి. కాగా, దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాటాల ధర ఏకంగా 46.73 శాతం పతనమైంది. జీ మీడియా కార్పొరేషన్ (40.54 శాతం), శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ (31.75 శాతం), సిటీ నెట్‌వ ర్క్స్ (28.16 శాతం) మొహొటా ఇండస్ట్రీస్ (26.61 శాతం) కంపెనీల వాటాలు కూడా భారీగానే నష్టపోయాయి. ఈవారం మార్కెట్ కేపిటల్‌ను పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మారుతీ సుజికీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభాలను ఆర్జించగా, వె దాంత, ఎస్ బ్యాంక్, హౌసింగ్ డెవలపింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హె చ్‌డీఎఫ్‌సీ), ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ వాటాలు నష్టాలను ఎదుర్కొన్నాయి. స్మాల్ క్యాప్‌లో మొత్తం మీద, స్థూలంగా చూస్తే, ఈవారం స్టాక్ మార్కెట్‌లో బుల్ ఆధిపత్యం కనిపించింది.