బిజినెస్

మార్కెట్ పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: స్టాక్ మార్కెట్ వచ్చే వారం ఏ విధంగా ఉంటుంది, ఏ దిశగా అడుగులు వేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గత వారం మార్కెట్ కుదుటపడిన లక్షణాలు కనిపించినప్పటికీ, అదే పరిస్థితి ఎంత వరకూ స్థిరపడుతుందనేది అనుమానంగానే ఉంది. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రపంచ మార్కెట్లతోపాటు భార త్ స్టాక్ మార్కెట్‌ను కూడా ఏ దిశలో నడిపిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం అమెరికాలో వైద్య సేవలు పొందుతున్న అరుణ్ జైట్లీ స్థా నంలో లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎన్నో పథకాలను, కీలక నిర్ణయాలను ప్రకటించారు. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను సిద్ధం చేయడంతో, నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని, జాతీయోత్పత్తికి దోహదపడే అంశాలు తగ్గుతాయని నిపుణుల అభిప్రా యం. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు సంక్షేమ పథకాలను ప్రకటించిన కారణంగా తలెత్తే బడ్జెట్ లోటు స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపురైతులకు ధన రూపేణా చెల్లింపులు చేస్తామంటూ మధ్యంతర బడ్జెట్ ద్వారా కేంద్రం ప్ర కటించింది. దీంతో, రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా కేంద్రం క్లిష్టతర చర్యలతో పరిస్థితిని గంద రగోళంలోకి నెడుతున్నదని, నిర్థిష్ట ప్రణాళికా లక్ష్యాలకు తిలోదకాలిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నా య. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3.5 శాతం తేడా వచ్చే అవకాశాలున్నాయని పీయూష్ గోయల్ తమ బడ్జెట్ ప్రసం గంలో పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 3.3 శాతంగా ఉండవచ్చని చెప్పారు. ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బడ్జెట్‌ను రూ పొందించడంతో, ప్రధాన లక్ష్యాలకు మరోసారి నీళ్లొదిలారని అటు ప్రతిపక్ష పార్టీల నేతలు, ఇటు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతులకు నగదు రూపేణా లబ్థిచేకూర్చే అంశాన్ని, అలాగే పన్ను మినహాయింపులను కల్పించే విషయాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలించడమేగాక, నేరుగా మధ్యంతర బడ్జెట్‌లోనే ఈ అంశాలను చేర్చించింది. రానున్న సార్వ్రతిక ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకట్టుకునే విషయాలపైనే బడ్జెట్ అంచనాలు కేంద్రీకృతమయ్యా యని అంటున్నారు. ప్రత్యేకించి ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయ లో రాణించలేకపోయంది. ప్రధాన రాష్ట్రాల్లో ని యంత్రణ కోల్పోవడంతో కేంద్ర సర్కారు ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందనే వాదన వినిపిస్తు న్నది. దీంతో మార్చి నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో సు మారు 3.5 శాతం తేడా వచ్చే అవకాశం ఉందని, ఇది గతంలో సర్కారు వేసిన అంచనా 3.3 శాతం కన్నా అధికమవుతుంది. రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చాలన్న ప్రణాళికలు దేశ ఆర్థిక లోటుకు మరిన్ని సవాళ్లు విసిరే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ప్రభుత్వం తన ఆర్థిక వనరులు పెంచుకునే అవకాశాలు తగ్గే ప్రమా దం కనిపిస్తున్నది. నిజానికి ఎన్డీఏ సర్కారు 2017 లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపింది. ప్రత్యేకించి పలు సంస్కరణలకు తెరలేపి పన్ను విధానంలో లోటుపాట్లు, బ్యాంకుల్లో అవినీతిని అరికట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. అయతే, ఇవి అప్పటికప్పుడు సత్ఫలితాలను ఇచ్చే అంశాలు కావు. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక రంగానికి విస్తృత ప్రయోజనాలు చేకూర్చేలా వున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.