బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 5: దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు మంగళవారం ఊగిసలాట, అస్థిరతలకులోనై మళ్లీ కోలుకుని దృఢంగామారి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. రిజర్వు బ్యాంకు మానిటరీ పాలసీ సమీక్షా సమావేశం కొనసాగుతున్న సందర్భంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. విదేశీ మార్కెట్ల నుంచి ఆశించినంత సానుకూలత లేకపోవడం సైతం దేశీయ మార్కెట్ల ఊగిసలాటకు కారణమని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరం భ దశలో వత్తిడికి గురైన సెనె్సక్స్ చివరికి 34.07 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 36,616.81 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ సైతం 22.10 పాయింట్లు ఎగబాకి 0.09 శాతం ఆధిక్యతతో 10,934.35 వద్ద ముగిసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో హీరోమోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు అధిక లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థలు సుమారు 2.66 శాతం అదనపు లాభాలను ఆర్జించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
నష్టపోయిన కంపెనీలివే..
సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్, యెస్‌బ్యాంక్, సన్‌పార్మా, ఐటీసీ, ఐసీఐసీ బ్యాంక్ నష్టపోయాయి. ఈ సంస్థలు సుమారు 2.63 శాతం నష్టపోయాయి. రిజర్వు బ్యాంకు మానిటరీ విధానంపై జరుగుతున్న సమీక్షా సమావేశంలో ఏ నిర్ణయం జరుగుతుందో వేచిచూద్దాం అనే ధోరణిని మంగళవారం మదుపర్లు ప్రదర్శించారని మార్కెట్ పరిశీలకులు పేర్కొంటున్నారు. మూడు రోజులపాటు జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం నుంచి ఆరంభమైంది. ప్రత్యేకించి కీలకమైన రేట్లపై ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. తక్కువ ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ తన వైఖరిని మార్చుకునే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే వార్షిక సవాళ్లు, చమురు ధరల పెరుగుదల వంటి సమస్యలున్న దృష్ట్యా రేట్లకు కోతవిధించే అవకాశాలు మాత్రం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలావుండగా బీఎస్‌ఈ స్మాల్ కాప్‌లో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సంబంధించినంత వరకు లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీలు నష్టాలను చవిచూడగా, బీఎస్‌ఈ మిడ్‌కాప్‌లోని మోటారు వాహనాలు, ఫైనాన్షియల్ సర్వీసులు లాభాలతో సంతరించుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ 0.19 శాతం నష్టపోగా, చైనాకు చెందిన బౌర్సెస్‌తోబాటు దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు మంగళవారం చాంద్రమానం ప్రకారం కొత్త యేడాది ప్రారంభమవుతున్న దృష్ట్యా మూతపడ్డాయి. యూరో జోన్‌లో ప్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డాక్స్ .83 శాతం, పారిస్‌కు చెందిన సీఏడీ-40 0.77 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 1.12 శాతం వంతున లాభాలను ఆర్జించాయి. డాలర్‌తో భారత రూపాయి విలువ మళ్లీ పుంజుకుని 4 పైసలు బలపడింది. ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌పై 0.64 శాతం పెరిగి 62.91 డాలర్లకు చేరింది.