బిజినెస్

రెండు రోజుల నష్టాల నుంచి కోలుకున్న రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 5: వరుసగా రెండు రోజు ల నష్టాల పరంపర నుంచి భారత రూపాయి మంగళవారం కోలుకుంది. అమెరికన్ డాలర్‌తో 23పైసలు బలపడి రూపాయి విలువ 71.57 రూపాయలకు చేరింది. విదేశీ నిధులు పెద్దమొత్తంలో పెట్టుబడులుగా రావడంతోబాటు, దేశీయ మార్కె ట్లు లాభాలతో ముగియడం రూపాయి బలోపేతానికి దోహదం చేసిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అలాగే ఆసియన్ మార్కెట్లలో అత్యధిక శాతం మంగళవారం చాంద్రమాన సంవత్సరారంభంతో మూతపడ్డాయి. ‘మూ డు రోజుల ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం ము గిసిన అనంతరం 7న తీసుకునే నిర్ణయంపై తమ కంపెనీ దేశీయ మార్కెట్ విశే్లషణలు ఆధారపడి ఉంటాయ’ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విభాగం పీసీజీ, మూలధన మార్కెట్ వ్యూహాల అధిపతి వీకే శర్మ తెలిపారు. తొలుత డాలర్‌తో 71.72 రూపాయలుగా ఆరంభమైన భారత రూపాయి విలువ ఆ తర్వాత 71.55 నుంచి 71.80 మధ్య కదలాడి చివరిగా 23 పైసలు బలపడి 71.23 రూపాయల వద్ద ముగిసింది. విదేశీ నిధులు ఎక్కువగా వెనక్కు మళ్లడంతోబాటు, ముడిచమురు ధరలు పెరగడం రూ పాయి విలువ మరింత పెరగకుండా నిరోధించాయ న్నారు. విదేశీయులు 420 కోట్ల రూపాయల విలువైన వాటాలు కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు 194.31 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారని మంగళవారం నాటి ప్రాధమిక గణాంకాలు వివరించాయి. కాగా డోనాల్డ్ ట్రంప్ స్టేట్ ఆఫ్‌ది యూనియన్ ప్రసంగంతో డాలర్ సూచీల్లోని ఆరు కరెన్సీలు అధిక విలువ (0.13శాతం)ను సంతరించుకున్నాయి.