బిజినెస్

సెక్యూరిటీల ద్వారా అదనంగా రూ.36వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరావసరాలకు అనుగుణంగా డేటెడ్ సెక్యూరిటీల ద్వారా 36వేల కోట్ల రూపాయలు అదనంగా సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన కేలండర్ మేరకు ప్రభుత్వ బాండ్ల ద్వారా చేపట్టిన చివరి ట్రాంచే కాలపమితి వచ్చే మార్చి 8తో ముగుస్తుంది. ఈక్రమంలో వచ్చే మార్చి 11నుంచి 15 వరకు, 18నుంచి 22 చేపట్టే రెండు ట్రాంచేల ద్వారా ఒక్కోదఫా 18వేల కోట్ల రూపాయలు మొత్తం 36 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో రీటైల్, సంస్థాగత ఇనె్వస్టర్లకు సక్రమంగా మదుపుచేసేందుకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి, పాదర్శకతను, అర్హతను ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో పొందేందుకు డేటెడ్ సెక్యూరిటీలతో కూడిన ఓ క్యాలండర్‌ను ఈ నెల 4 నుంచి మార్చి 31 వరకు అమలయ్యే విధంగా రూపొందించడం జరిగింది. రిజర్వుబ్యాంకు చట్టాల మేరకు ఈ క్యాలండర్‌కు రూపకల్పన జరిగిందని ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన వెల్లడించింది. ఈ క్యాలండర్‌లో పేర్కొన్న నోటిఫైడ్ సొమ్ము, ఇస్యూయెన్స్ కాలవ్యవధి, మెచూరిటీ తదితర అంశాల్లో ఇనె్వస్టర్లకు అనుగుణంగా సరళతర విధానాలను అమలు చేసే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ క్రమంలోనే నాన్ స్టాండర్డ్ మెచూరిటీ, ఫ్లోటింగ్ రేట్ బాండ్లు, రీటైల్ ఇన్‌ఫ్లేషన్ లింక్డ్ బాండ్లు వంటివి తీసుకురావడానికి చర్యలు చేపట్టిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవి ప్రభుత్వ అవసరాలు, మార్కెట్ పరిస్థితులనుబట్టి ఉంటాయి. అలాగే గ్రీన్ షూ ఐశ్చికాలపై రూ.1000 కోట్లు అదనంగా సమీకరించేందుకు హక్కులను ఉంచుకునేలా ప్రభుత్వం ఆర్బీఐతో చర్చలు సాగిస్తోంది.