బిజినెస్

అనధికారిక లావాదేవీలకు బ్యాంకులదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచ్చి: కస్టమర్ల బ్యాంకు ఖాతాల నుంచి జరిగే అనధికారిక విత్‌డ్రాలకు తమది బాధ్యత కాదని బ్యాంకులు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని కేరళ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఖాతాదార్లు ఎస్‌ఎంఎస్ అలర్టులతో స్పం దించలేకపోయినా వారి ఖాతాల నుంచి అ నధికారికంగా సొమ్ము విత్‌డ్రా జరిగితే బ్యాంకులు బాధ్యత వహించాల్సిందేనని న్యాయమూర్తి జస్టిస్ పీబీ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చినంత మాత్రాన బాధ్యత తీరిపోయిందని భావించ డం సరికాదన్నారు. ఎస్‌ఎంఎస్‌లు ప్రతిని త్యం పరిశీలించే తీరికలేనివారు, అసలు ఆ విషయంపై అవగాహన లేనివారు ఎంతోమంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అనధికారిక విత్‌డ్రాయల్ కారణంగా రూ. 2.4 లక్షల సొమ్ము పోగొట్టుకున్న ఖాతాదారుడికి నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా కింది స్థా యి కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారు లు చేసిన అప్పీల్‌ను ఈ సందర్భంగా న్యా యమూర్తి కొట్టివేశారు. ఈ కేసులో బాధితు డు తను పొగొట్టుకున్న సొమ్ముకు వడ్డీతో స హా చెల్లించాలని కోరడం జరిగింది. ఐతే ఈ విషయంపై తాము ఖాతాదారుడికి ఎస్‌ఎంఎస్ అలెర్ట్ చేసినా ఆయన వెంటనే స్పందిం చి తన ఖాతాను బ్లాక్ చేయమని కోరలేదని, అందువల్ల బ్యాంకు ఈ కేసులో బాధ్యత వహించబోదని సంబంధిత అధికారులు వాదించారు. కాగా ‘ఓ బ్యాంకు కేవలం ఖాతాదారుల సొమ్ముతో నడుస్తుందని, అలాంటిది వారి ఖాతాల నుంచి అనధికారిక లావాదేవీలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా బ్యాంకుకే ఉంటుంద’ని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.