బిజినెస్

పీఎఫ్ వడ్డీ రేటు యథాతథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ రేటును మార్చే ఉద్దేశం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)కి లేదని సమాచారం. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ, గతంలో మాదిరిగానే 8.55 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రెపో, రివర్స్ రెపో రేటును ఆర్‌బీఐ సవరించినప్పటికీ, దాని ప్రభావం పీఎఫ్ వడ్డీ రేటుపై ఉండదు. ఆరు కోట్లకుపైగా ఖాతాదారులు ఉన్న ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటును ఏ మాత్రం తగ్గించినా, పెంచినా పరిణామాలు భారీగానే ఉంటాయి. ఈనెల 21వ తేదీన జరిగే పాలక వర్గ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేటుపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, 8.55 శాతాన్ని కొనసాగించాలని ఇప్పటికే ఈపీఎఫ్‌ఓ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇలావుంటే, రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఈపీఎఫ్‌ఓ ఆచితూచి వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభిప్రాయం ప్రకారం పీఎఫ్ వడ్డీ రేటును పెంచాలి. ఒకవేళ కేంద్రం ఒత్తిడి తెస్తే, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో సమావేశమయ్యే పాలక మండలి సమావేశంలో జమాఖర్చులతోపాటు, వడ్డీ రేటుపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో జమ, ఖర్చును పాలక మండలిగా పేర్కొనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) పరిశీలిస్తుంది. చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేస్తుంది. అదే విధంగా పీఎఫ్ వడ్డీ రేటుపైన కూడా చర్చించి, తీర్మానాన్ని ఆమోదిస్తుంది. అనంతరం, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో, అంతకు ముందు ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా, అత్యంత తక్కువ వడ్డీ రేటుగా 8.55 శాతాన్ని సీబీటీ నిర్ణయించింది. డిపాజిట్లపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేటును పెంచుతుంటే, ఈపీఎఫ్‌ఓ మాత్రం వడ్డీని తగ్గించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను ఆకట్టుకోవడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఆ క్రమంలోనే పీఎఫ్ వడ్డీ రేటును పెంచినా ఆశ్చర్యం లేదు. కానీ, ప్రస్తుతానికి ఈపీఎఫ్‌ఓ వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని అంటున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే, మరో పది రోజులు వచిచూడక తప్పదు.