బిజినెస్

వరుసగా రెండో రోజూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో, పార్మా రంగాల్లో మదుపర్లు పెద్దయెత్తున వాటాల అమ్మకాలకు దిగడంతో సోమవారం మరోమారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ 49.80 పాయింట్ల వంతున నష్టపోయాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తికి సంబంధించిన గణాంకాలు ఈవారం వెల్లకావాల్సి వుండటంతో మదుపర్లు జాగరూకతతో వ్యవహరించారు. దీనికి అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూలతలు తోడయ్యాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఆదాయాల్లో సైతం తగ్గుదల నెలకొనడం విశేషం. 30 షేర్ల సెనె్సక్స్ తొలుత 36,300.48 పాయింట్లు ఆ తర్వాత 36,588.03 పాయింట్ల వద్ద ఊగిసలాడి చివరిగా 151.45 పాయింట్లు కోల్పోయి 0.41 శాతం నష్టాలతో 36,395.03 దిగువన స్థిరపడింది. గత రెండు సెషన్లతో పొలిస్తే సెనె్సక్స్ దాదాపు 429 పాయింట్లు నష్టపోయింది. కాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.80 పాయింట్లు కోల్పోయి 0.50 నష్టాలతో 10,88.80 వద్ద ముగిసింది.
ఈ సూచీ సైతం రోజంతా 10,857.10 పాయింట్ల దిగువన తర్వాత 10,930.90 పాయింట్లతో ఎగువన కదలాడింది. ఆటో రంగానికి చెందిన స్టాక్స్ రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 5 శాతం నష్టపోయిన సంస్థగా నిలిచింది. ఈ సంస్థ గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక లాభాల్లో 11.44 శాతం తక్కువగా గత శుక్రవారం ప్రకటించడం సోమవారం సైతం ప్రతికూలతకు దారితీసిందంటున్నారు. అలాగే లీడింగ్ మోటారు వాహనాల తయారీదార్లు సైతం త్రైమాసిక ఆర్జనలో తగ్గుదలను ప్రకటించడం వల్ల ఈ రంగానికి చెందిన వాటాలు వత్తిడికి గురయ్యాయని అంటున్నారు. దేశీయంగా పాసింజర్ వాహనాల విక్రయాలు వరుసగా మూడో నెలలో సైతం 1.87 శాతం తగ్గిపోయాయి. ఎస్‌ఐఏఎం అంచనాల మేరకు పండుగ సీజన్‌కు సంబంధించిన విక్రయాలను డీలర్లు ఇప్పటికీ కొనసాగిస్తుండటంతో తయారీదార్లు కొత్త ఫీచర్లతో కూడిన వాహనాలు తయారు చేయడం లేదు. కాగా సోమవారం నష్టపోయిన సంస్థల్లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, వేదాంత, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు 2.54 శాతం నష్టాలను చవిచూశాయి.
లాభపడిన సంస్థలివే..
మరోవైపు టాటాస్టీల్, పవర్‌గ్రిడ్, హెసీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, మారుతీ సంస్థల వాటాలు సోమవారం లాభాలను సంతరించుకున్నాయి. దాదాపు 2.31 శాతం అదనపు లాభాలను ఈ సంస్థలు ఆర్జించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఎల్‌ఎల్) 960.04 కోట్ల విలువైన వాటాల విక్రయానికి పాల్పడ్డారు. ఐతే విదేశీ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లు 843.73 కోట్ల రూపాయల విలువైన వాటాలను గత శుక్రవారం కొనుగోలు చేశారు.