బిజినెస్

నీరసపడిన బుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో చాలా రోజులుగా బుల్ రన్ కనిపించడం లేదు. వాటాల అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 157.89 పాయింట్లు (0.44 శాతం) పతనమై, 35,876.22 పాయింట్ల వద్ద ముగిసింది. ఐదు సెషన్లలో ఎదురైన నష్టాల నుంచి గట్టెక్కుతుందనుకున్న స్టాక్ బ్రోకర్లు, మదుపరులకు ఆరో రోజు కూడా నిరాశే ఎదురైంది. అత్యల్పంగా 35,799.42, అత్యధికంగా 36,109.10 పాయింట్ల మధ్య ఊగిసిలాడిన సెన్సెక్స్ చివరికి 36 వేలకు దిగువన ముగిసింది. గత ఐదు సెషన్లలో మొత్తం 840 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడిచింది. 47.60 పాయింట్లు (0.44 శాతం) పతనమైన నిఫ్టీ 10,746.05 పాయింట్లుగా నమోదైంది. రోజు మొత్తంలో 10,718.05 నుంచి 10,792.70 పాయింట్ల మధ్య నిఫ్టీ ఊగిసలాడింది. ఇలావుంటే, గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఓఎన్‌జీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలు ఉన్నాయి. వీటి షేర్లు సగటున 3.09 శాతం పతనమయ్యాయి. అయితే, ఎస్ బ్యాంక్ ఎవరూ ఊహించని విధంగా లాభపడింది. టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. ఈ సంస్థల వాటాల సగటున 3.17 శాతం లాభాలను ఆర్జించడం విశేషం. వివిధ రంగాల పరంగా చూస్తే, చమురు-సహజ వాయువు, ఐటీ, మెటల్, ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ తదితర కంపెనీల సూచీలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ముడి చమురు ధరల్లో అనిశ్చితి మరోసారి తెరపైకి రావడంతో, ఎమర్జీ స్టాక్స్‌కు ఆ సెగ తప్పలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 1.26 శాతం పెరగడంతో, బ్యాలర్ ఖరీదు 64.41 డాలర్లకు చేరింది. చమురు సప్లయి చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా ఉత్పత్తిని తగ్గంచుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పడిపోకుండా సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం మరికొంత కాలం కొనసాగుతుందనే వార్తలు చమురు, సహజ వాయువుల కంపెనీలపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఐఓసీ, బీపీసీఎల్ కంపెనీల షేర్లు 4.19 శాతం పతనమయ్యాయి. ఈ రంగంలోని కంపెనీలు అత్యధికంగా, సగటున 2.11 శాతం నష్టాలను చవిచూశాయి. ఐటీ షేర్లు 1.28 శాతం, ప్రభ్వు రంగ సంస్థలు 0.78 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.42 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.06 శాతం చొప్పున నష్టాలు ఎదుర్కొన్నాయి. కాగా, మిడ్ క్యాప్ సూచీల్లో 0.52 శాతం, స్మాల్ క్యాప్‌లో 0.17 శాతం పెరుగుల సాధ్యమైంది.