బిజినెస్

ఎస్ బ్యాంక్‌కు యమ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: ఎస్ బ్యాంక్ వాటాలకు గురువారం నాటి ట్రేడింగ్‌లో అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలకు కేటాయింపులు జరపడంతో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆర్‌బీఐ తన నివేదికలో స్పష్టం చేసినట్టు ఎస్ బ్యాంక్ ప్రకటించిన వెంటనే, షేర్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. అటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో, ఇటు నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ గురరువారం ఉదయం నుంచే ఎస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. బీఎస్‌ఈలో సాయంత్రం లావాదేవీలు ముగిసే సమయానికి 28.95 శాతం పెరిగిన ఎస్ బ్యాంక్ వాటా ధర 218 రూపాయలకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో 29.97 రూపాయలు పెరగడంతో 220.25 రూపాయల వద్ద ముగిసింది. మొత్తం మీద బీఎస్‌ఈలో 8,590.52 కోట్ల రూపాయలుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ 47,714.21 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంక్ వివిధ ఖాతాలకే కేటాయించిన మొత్తాల విషయంలో అక్రమాలుగానీ, పొరపాట్లుగానీ జరగలేదన్న వార్త ఎస్ బ్యాంక్ షేర్లకు అనుకోని డిమాండ్‌ను తెచ్చిపెట్టింది.