బిజినెస్

లండన్‌లోని మిగులు వాటాలను ఉపసంహరించనున్న లోథా డెవలపర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: ముంబయికి చెందిన రియాలిటీ సంస్థ ‘లోథా డెవలపర్స్’ లండన్‌లోని తన డెవలప్‌మెంట్ విభాగం నుంచి అదనపువాటాలను వెనక్కు తీసుకోనుందని రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. 2020 మార్చి నాటికి బాండ్ మెచూరిటీలోగా ఈ కంపెనీ తన పరపతిని తగ్గించుకుని అదనంగా నిధులను సమీకరించాలని నిర్ణయించుకుందని ఆ ఏజెన్సీ తెలియజేసింది. లండన్‌లోని లోథా డెవలపర్స్ శాఖ నుంచి 28 శాతం వాటాలను విక్రయించడం ద్వారా ఆ దేశంలో ప్రస్తుతం డెవలప్‌మెంట్ చేస్తున్న రెండు ఆస్తులపై పెట్టుబడులను తగ్గించుకోవడానికి లోథా డెవలపర్స్ కృషి చేస్తోందని, తద్వారా మరోమారు వాటాలను తగ్గించుకునేందుకు ఈ సంస్థ మార్గం సుగమం చేసుకుంటోందని మూడీస్ తెలిపింది. లోథా డెవలపర్స్‌కు లండన్‌లో 48 కేరీ స్ట్రీట్‌లో, గ్రాస్‌వెనార్ స్క్వార్‌లో రెండు ఆస్తులున్నాయి. ఇక్కడ ఈ సంస్థ ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగిస్తోంది. లండన్‌లోని 6000 కోట్ల రూపాయల విలువైన ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను కంపెనీ చెల్లించివేయడం వల్ల అక్కడ అదనపునిధులు సమకూరాయి. చిన్నచిన్న నష్టాలు ఎదురైనా అక్కడ ఈ ప్రాజెక్టులపై సుమారు 430 నుంచి 500 మిలియన్ జీబీపీ (పౌండ్ల) వరకు మిగులు నిధులు ఉండే అవకాశం ఉందని లోథా డెవలపర్స్ అంచనా వేస్తోంది. లండన్‌లోని ఎల్‌డీయూకేఎల్ ద్వారా తాము పొందిన 480 మిలియన్ డాలర్ల వాటా రుణాన్ని తీర్చేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.