బిజినెస్

పెద్ద సంస్థలకు భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: గత వారం ట్రేడింగ్‌లో పెద్దపెద్ద సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. స్థూలంగా చూస్తే, అత్యంత విలువైన ‘టాప్-10’ కంపెనీల్లో ఐటీసీ మినహా చాలా సంస్థలు ప్రతికూల పవనాలు ఎదుర్కొన్నాయి. 98,862.63 కోట్ల రూపాయల మేరకు మార్కెట్ విలువ తగ్గడం ఈ సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నది. భారీ నష్టాలను చవిచూసిన సంస్థల్లో రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందుస్థాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్), ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) వారంతపు సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. రిల్ మార్కెట్ విలువ 21,456.38 కోట్ల రూపాయలు పతనమై, 7,88,213.12 కోట్ల రూపాయలకు చేరింది. ఎస్‌బీఐ మార్కెట్ విలువ పతనం 19,723.34 కోట్ల రూపాయలుకాగా, 2,34,672.03 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. అదే విధంగా ఐటీసీ 11,951.35 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కోవడంతో, దాని మార్కెట్ విలువ 7,62,071.81 కోట్ల రూపాయలకు పడిపోయింది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ (నష్టం 11,725.23 కోట్ల రూపాయలు, ప్రస్తుత మార్కెట్ విలువ 3,22,531.39 కోట్ల రూపాయలు), హెచ్‌యూఎల్ (నష్టం 9,600.22 కోట్ల రూపాయలు, ప్రస్తుత మార్కెట్ విలువ 3,83,803.08 కోట్ల రూపాయలు), ఐసీఐసీ బ్యాంక్ (నష్టం 8,293.27 కోట్ల రూపాయలు, ప్రస్తుత మార్కెట్ విలువ 2,20,351.47 కోట్ల రూపాయలు), ఇన్ఫోసిస్ (నష్టం 7,906.92 కోట్ల రూపాయలు, ప్రస్తుత మార్కెట్ విలువ 3,24,044.79 కోట్ల రూపాయలు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (నష్టం 5,998.66 కోట్ల రూపాయలు, ప్రస్తుత మార్కెట్ విలువ 5,71,599.92 కోట్ల రూపాయలు) కోటక్ మహీంద్ర (నష్టం 2,207.79 కోట్ల రూపాయలు, మార్కెట్ విలువ 2,44,943.86 కోట్ల రూపాయలు) భారీ నష్టాలను ఎదుర్కొన్న సంస్థల్లో ఉన్నాయి. కాగా, ఐటీసీ మాత్రం అనూహ్యంగా లాభపడింది. ఆ కంపెనీ షేర్ల విలువ 4,593.55 కోట్ల రూపాయలు పెరగ్గా, మార్కెట్ విలువ 3,42,495.09 కోట్ల రూపాయలకు చేరింది.