బిజినెస్

పోటెత్తుతున్న ఎర్ర బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 18: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రోజురోజుకు తగ్గు ముఖం పడుతున్న మిర్చి ధర కోసం జిల్లా రైతులు అనేక పాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటకు కనీసం మద్దతు ధర దక్కించుకునేందుకు రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్‌కు పంటను తీసుకువచ్చిన ఆశించిన ధర రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. గత నాలుగురోజులుగా 8,700నుండి 8,900వరకు పలికిన మిర్చి ధర రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. దీంతో రైతులు వారి మిర్చి పంటను సకాలంలో అమ్ముకొని కనీస మద్దతు ధర దక్కించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు కూలీల ధర కూడా పెరగటంతో చేసేదేమి లేక కూలీలకు అధిక ధరలు చెల్లించి మిర్చి కోతలు కోసుకొని పంటను మార్కెట్‌లో అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా 25వేల నుండి 26వేల వరకు మిర్చి బస్తాలు రాగా, సోమవారం 30వేల బస్తాలకు పైగా వచ్చాయి. ఖమ్మం మార్కెట్‌లో సోమవారం మిర్చి పంటకు గత వారం కంటే 100రూపాయలు అధికంగా 9వేల రూపాయలు పలకటంతో రైతులు కొంత మేరకు ఆనంద పడినా గిట్టుబాటు ధర కంటే అది తక్కువ కావటంతో వ్యాపారులతో గొడవ పడిన వారు కూడా ఉన్నారు. కాగా మార్కెట్‌కు మిర్చి బస్తాలు అధికంగా రావటంతో మార్కెట్ అధికారులు రైతుల బస్తాలను క్రమ పద్దతిలో పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొనుగోలు చేసిన బస్తాలను వెంటనే వ్యాపారులు అక్కడి నుండి తరలించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ధర రానున్న రోజుల్లో ఉంటుందో లేదోనన్న సందేహాలతో రైతులు మిర్చి పంటను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు.