బిజినెస్

మార్కెట్‌లోకి బెనెల్లీ బైక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: ఇటలీకి చెందిన బెనెల్లీ కంపెనీ సోమవారం రెండు బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. టీఆర్‌కే 502, టీఆర్‌కే 502 ఎక్స్ పేర్లతో విడుదలైన ఈ బైక్‌ల ధర ఐదు లక్షలు, ఐదు లక్షల నలభై వేల రూపాయలు. చైనాకు చెందిన క్విన్‌జియాంక్ గ్రూప్‌కు చెందిన బెనెల్లీ గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన మహావీర్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో మోటార్‌సైకిళ్ల తయారీ, పంపిణీకి సంబంధించిన ఈ కాంట్రాక్టు విలువ వెల్లడి కాలేదు. ఇలావుంటే, మార్కెట్‌లోకి విడుదలైన ఈ రెండు 500 సీసీ బైక్‌లకు అత్యంత శక్తివంతమైన జంట సిలిండర్ ఇంజన్లు ఉంటాయి. 1,500 నుంచి 2,000 బైక్‌లు అమ్ముడు కావచ్చని బెనెల్లీ అంచనా వేస్తున్నది.