బిజినెస్

తగ్గించిన వడ్డీ రేట్లపై బ్యాంకర్లతో చర్చిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఇటీవల తగ్గించిన వడ్డీ రేట్లపై ఈనెల 21న బ్యాంకర్లతో సమావేశమై చర్చిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేట్లను సవరించిన విషయం తెలిసిందే. వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. దీనితో రుణగ్రహీతలకు వడ్డీ భారం 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది. అయితే, ఎస్‌బీఐ వంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మిగతా బ్యాంకులేవీ ఈ అంశాన్ని ఇప్పటి వరకూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎస్‌బీఐ కూడా వడ్డీ రేటును ఆర్‌బీఐ సూచించినట్టు 0.25 శాతం కాకుండా, 0.05 శాతం మాత్రమే తగ్గించింది. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగ బ్యాంకులు రెపో రేటు సవరణను పట్టించుకోవకపోవడాన్ని ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నది. తగ్గించిన వడ్డీ రేటును ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని బ్యాంకులూ అమలు చేయాలని కోరుతున్నది. రుణగ్రహీతలకు సవరించిన వడ్డీ రేటు తగ్గుదల వర్తించేలా చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులతో ఈనెల 21న సమావేశమవుతామని శక్తికాంత దాస్ ప్రకటించారు. అన్ని బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎండీలతో సమావేశమై, చర్చించడం ద్వారా రుణగ్రహీతలకు సవరించిన వడ్డీ రేటు అమలయ్యేలా చూస్తామని శక్తికాంత దాస్ తమ ప్రకటనలో పేర్కొన్నారు.