బిజినెస్

తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల తరహా రాయితీలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఫిబ్రవరి 19: పరిశ్రమల స్థాపనకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సమకూరుస్తున్న రాయితీల్లాంటివి తమకు కూడా కల్పించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు విన్నవించారు. ఈ మేరకు వారు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు దాదాపు 61 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశం లో దుకాణాలు, వాణిజ్య వ్యవహారాలకు సంబంధించిన విధవిధానా లు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోలా ఉండాలని ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు ముఖ్యమంత్రికి సూచించారు. రంగాల వారీగా పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం కమల్‌నాథ్ బదులిచ్చారు. పారిశ్రామికవేత్తల కోరిక మేరకు త్వరలో ఒక పారిశ్రామిక క్లస్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆరుగురు లేదా ఏడుమంది ప్రత్యేక అధికారుల బృందాన్ని సైతం పారిశ్రామిక సమస్యల పరిష్కారం కోసం నియమిస్తామని, వారు నేరుగా తనకు నివేదిస్తారని ఆయన చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక అనుమతుల కోసం ఏర్పాటు చేసిన సింగిల్ విండో విధానం సత్ఫలితాలను ఇవ్వలేదని ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా నాథ్ చెప్పారు.