బిజినెస్

బ్రిటన్‌లోని కార్ల కంపెనీని మూసివేయనున్న హోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఫిబ్రవరి 19: పడమటి ఇంగ్లాండ్‌లో ఉన్న తమ కంపెనీ కార్ల ఫ్యాక్టరీని 2021లో మూసివేయనున్నట్టు హోండా మోటార్ కో లిమిటెడ్ యాజమాన్య మంగళవారం నాడిక్కడ తెలిపింది. మార్చి 29 నుంచి యూరోపియన్ యూనియన్ మార్కెట్ల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని హోండా మోటార్ కో లిమిటెడ్ కంపెనీ భావిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ వాహనాల తయారీ కంపెనీ తాజా నిర్ణయంతో సుమారు 3,500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది. హోండా అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో మంగళవారం టోక్యోలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం బ్రిటన్ నుంచి తొలగిపోవాలన్న ఉద్దేశ్యంతో తామీ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైన విద్యుత్ వాహనాల తయారీపై ప్రధాన దృష్టి నిలిపేందుకు ఇలాంటి చర్యలు తప్పడం లేదన్నారు. బ్రిటన్ నుంచి వైదొలగడం వల్ల తమ కంపెనీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయాన్ని అప్పుడే చెప్పలేమన్నారు. బ్రిటన్‌లో కార్ల కంపెనీని ఎత్తివేయడం వల్ల నష్టపోయే ఉద్యోగులతో ఇప్పటికే చర్చలు ప్రారంభించామని హచిగో తెలిపారు. ఇలాంటి పరిస్థితిని తాము ఎదురు చూడలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనివార్యమైందని అన్నారు. లండన్‌లోని ఫ్యాక్టరీ ద్వారా జనం మెచ్చే అత్యంత అధునాతన మోడళ్లతో కూడిన వాహనాలను తయారు చేశామని, యేడాదికి 150,000 కార్లు అక్కడ తయారవుతున్నాయని తెలిపారు. తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్న ఆసియా, ఉత్తర అమెరికాల్లో మరింతగా వాణిజ్య విస్తరణను చేపడతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రిటన్‌లో అమ్ముడవుతున్న తమ కంపెనీ సివిక్ వాహనాల తదుపరి తదుపరి మోడల్‌ను జపాన్ నుంచి బ్రిటన్‌కు ఎగుమతి చేస్తామన్నారు. అలాగే టర్కీలోని తమ కంపెనీ కార్యకలాపాల్లో సైతం కొన్ని సర్దుబాట్లు చేస్తామని హచిగో చెప్పారు. అక్కడ ప్రస్తుతం యేడాదికి 38వేల సివిక్ సెడాన్స్ వాహనాలను తయారు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో అక్కడి వాటార్లతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాలని భావిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం భారత, చైనాల నుంచి తమ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోందన్నారు.