బిజినెస్

భారత్-అర్జెంటీనా మధ్య బలమైన వాణిజ్య బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: భారత, అర్జెంటీనాల మధ్య వాణిజ్య పరమైన బంధాలను బలోపేతం చేసుకోదలిచామని మన దేశంలో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిసియో మక్రి పేర్కొన్నారు. తమ దేశానికి భారత్ మంచి ‘్భవిష్యత్ భాగస్వామి’గా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో మన దేశానికి చెందిన కొంతమంది నేతలను కలుసుకున్న అనంతరం మంగళవారం నాడిక్కడ జరిగిన వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అతి స్వల్ప వ్యవధిలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఐదు సార్లు కలిసి చర్చలు జరపడం ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్ మంచి భాగస్వామి కావాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇచ్చిపుచుకునే విషయంలో మరింత సత్సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన తమ దేశం ఆహారం, ఇంధన వనరులను అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌కు అందజేస్తుందన్నారు. సేవ, సమాచార సాంకేతిక, పర్యాటక, గనులు, సాంప్రదాయేతర ఇంధన రంగాల్లో ఇరు దేశాల నడుమ వాణిజ్య బంధాల బలోపేతానికి అనువుగా ఉన్నాయని మక్రి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో వేగంగా అనుసంధానమై ప్రగతి సాధిస్తూ అర్జెంటీనా ప్రశంసలందుకుంటోందన్నారు. కాగా పారిశ్రామిక ప్రముఖుడు ఆది గోద్రేజ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వాణిజ్య సుమారు మూడు బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య సంబంధాలున్నాయన్నారు. సమాచార సాంకేతిక వస్తువులు, వ్యవసాయ రసాయనాలు, ఔషధ, కాస్మోటిక్స్ మన దేశం అర్జెంటీనాకు ఎగుమతి చేస్తుండగా, ఆ దేశం నుంచి వెజిటబుల్ ఆయిల్స్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మన దేశానికి దిగుమతి అవుతోందని వివరించారు. మన దేశానికి చెందిన కంపెనీలు ఇప్పటి వరకు అర్జెంటీనాలో సుమారు ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడులు టీసీఎస్ (ఐటీ), ఆటో (బజాజ్), పార్మా (గ్లెన్‌మార్క్) వంటి వాటిలో పెట్టారన్నారు. ఈ దక్షిణ అమెరికన్ దేశంలో తమ గోద్రేజ్ కంపెనీ పెట్టుబడులు కూడా ఉన్నాయన్నారు.

చిత్రం.. న్యూఢిల్లీలో జరిగిన వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిసియో మక్రి