బిజినెస్

వరుసగా తొమ్మిదో రోజూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా తొమ్మిదో రోజూ దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల బాట పట్టాయి. విదేశీ పెట్టుబడులు వరుసగా తరలిపోతుండటంతోబాటు ఐటీ స్టాక్స్‌లో పెద్దయెత్తున వాటాల విక్రయం జరగడం, అంతర్జాతీయంగానూ ప్రతికూల వాతావరణం ఎదవడంతో ఇనె్వస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకడుగు వేశారు. ఈక్రమంలో 30 షేర్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ సూచీ మంగళవారం ఉదయం సానుకూల వాతారణంలోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఉన్నట్టుండి తిరోగమనంలో సాగింది. చివరకు 0.41 శాతం నష్టాలతో 145.83 పాయింట్లు కోల్పోయి 35,352.61 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 36.60 పాయింట్లు కోల్పోయి 0.34 శాతం నష్టాలతో 10,604.35 వద్ద ముగిసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టీసీఆర్ అత్యధికంగా 3.38 శాతం నష్టపోయింది. అలాగే ఎన్‌టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లు కూడా నష్టాలను మూటగట్టుకోగా మరోవైపు వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు సుమారు 3.38 శాతం అధికంగా లాభాలను సంతరించుకున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. యూరోపియన్ ఆర్థికాభివృద్ధి గణాంకాలు నెమ్మదించడంతోబాటు భారత-పాకిస్తాన్ దౌత్య సంబంధాలకు విఘాతం కలిగిన క్రమంలో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని విశే్లషకులు అంటున్నారు. బీఎస్‌ఈ ఐటీ సూచీలు సుమారు 2.09 శాతం నష్టపోగా, విద్యుత్, వినిమయ వస్తువుల వాటాలు కూడా నష్టపోయాయి. లోహ, టెలికాం, వాహనాలు, రియాలిటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (ఎప్‌ఎల్‌ఎల్) భారీగా వాటాల అమ్మకాలకు పాల్పడ్డారు. వీరు 1,239.79 కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు. ఐతే దేశీయ సంస్ధాగత మదుపర్లు మాత్రం సోమవారం నాడు 2,336.74 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేయడం విశేషం.
పుంజుకున్న అంతర్జాతీయ మార్కెట్లు
చైనా-అమెరికా మళ్లీ వాణిజ్య చర్చలను ఆరంభించడంతో అంతర్జాతీయ మార్కెట్ సూచీలు కొంతవరకు పుంజుకున్నాయి. ఆసియాలో మాత్రం హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 0.42 శాతం నష్టపోగా, కొరియాకు చెందిన కోస్పి 0.24 శాతం వంతున నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 0.09 శాతం లాభాలను సంతరించుకోగా, షాంఘాయ్ కాంపోజిట్ ఇండెక్స్ 0.04 శాతం లాభాలను నమోదు చేసింది. యూరోపియన్ దేశాల్లో ప్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.12 శాతం, పారిస్‌కు చెందిన సీఏడీ-40 0.40 శాతం వంతున నష్టపోయాయి. ఇలావుండగా మంగళవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దేశీయ మార్కెట్లు మూతపడ్డాయి. ముడిచమురు ధరలు బ్యారల్‌పై 0.29 శాతం తగ్గి 66.31 డాలర్లు పలికింది.