బిజినెస్

పతనమైన రిలయన్స్ గ్రూప్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: రిలయన్స్ గ్రూప్ కంపెనీల వాటాలు బుధవారం 10.3 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీల చైర్మన్ అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పరిశీలకులు భావిస్తున్నారు. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌కు రూ.550 కోట్ల్లు చెల్లించకుండా కావాలని అనిల్ అంబానీ కోర్టు దిక్కారానికి పాల్పడ్డారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆయనతోబాటు మరో ఇద్దరిని దోషులుగా పేర్కొం ది. నాలుగు వారాల్లో రూ.453 కోట్లు ఎరిక్‌సన్ సంస్థకు చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్షకు గురికావలసి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ క్రమంలో రిలయన్స్ కేపిటల్ 10.26 శాతం నష్టపోగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 9.46 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 8.75 శాతం, రిలయన్స్ పవర్ 5.52 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 5 శాతం వంతున నష్టపోయాయి.