బిజినెస్

సాఫ్ట్‌వేర్‌ను పటిష్టం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: బ్యాంకింగ్ వ్యవస్థ సైబర్ సెక్యూరిటి నుంచి ఎదురవుతున్న రిస్క్‌లు, సవాళ్లతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం వల్ల కలుగుతున్న అంతరాయాలను పరిష్కరించుకోవడానికి తనకు తాను సిద్ధం కావలసిన అవసరం ఉందని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ సైబర్ దాడులకు గురయ్యేంత బలహీనంగా ఉందని, అందువల్ల ఈ సాఫ్ట్‌వేర్‌ను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లోని నేషనల్ సెక్యూరిటి కౌన్సిల్ సెక్రటేరియట్‌లో నేషనల్ సైబర్ సెక్యూరిటి కోఆర్డినేటర్ గుల్షన్ రాయ్ అన్నారు. ఐబీఏ బుధవారం ఇక్కడ నిర్వహించిన బ్యాంకింగ్ టెక్నాలజి సమ్మిట్‌ను ఉద్దేశించి ఆయన ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. బ్యాంకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం వల్ల ఉద్భవించిన రిస్క్‌లను ఎదుర్కోవడానికి వాటి సిస్టమ్ సామర్థ్యాలను బట్టి ముందుకొస్తున్న సవాళ్లను అధిగమించడానికి పరివర్తన చెందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘తరువాతి తరం వస్తువులతో వ్యవహారాలు నడుపుతున్న ప్రపంచంలో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రతి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ తరువాతి తరానిదే’ అని ఆయన అన్నారు. అయిదో తరం టెలికం నెట్‌వర్క్‌లు వస్తున్న తరుణంలో సజావుగా అమలు చేయడం కోసం ప్రభుత్వం ఫ్రీ ట్రయల్స్‌ను ప్రారంభించింది’ అని ఆయన తెలిపారు.