బిజినెస్

ఎలక్ట్రిక్ బస్సుల వ్యాపారంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 20: టాటా మోటార్స్ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా భారీగా వ్యాపారం చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రభుత్వ రవాణా సంస్థల నుంచి 255 యూనిట్ల ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు ఆర్డర్లు పొందింది. టాటా మోటార్స్ లిమిటెడ్ వాణిజ్య వాహనాల వ్యాపారం గణనీయంగా వృద్ధి సాధించిందని, ప్రస్తుతం ఈ విభాగంలో 45 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందని ఆ కంపెనీ ప్రొడక్ట్ లైన్ హెడ్ (ప్యాసెంజర్ కమర్షియల్ వెహికల్స్) రోహిత్ శ్రీవాస్తవ బుధవారం తెలిపారు. ‘ఇప్పటి వరకు మేము వృద్ధి సాధించాం. మేము ఇప్పటి వరకు లేని సెగ్మెంట్లలో ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాం’ అని శ్రీవాస్తవ బుధవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వాలకు 60 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా 40 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని ఆయన వివరించారు. టాటా మోటార్స్ లిమిటెడ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రవాణా సంస్థకు 80 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే ప్రక్రియలో ఉందని ఆయన వెల్లడించారు.