బిజినెస్

ఎట్టకేలకు పుంజుకున్న దేశీయ మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: దేశీయ సంస్థాగత మదుపర్లు స్థిరంగా వాటాల కొనుగోళ్లు చేస్తుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్నా యి. తొమ్మిది రోజుల పాటు నష్టాలకు బ్రేక్ పడింది. లోహ, బ్యాం కింగ్, రియాలిటీ వాటాలు అధిక లాభాలను సంతరించుకున్నాయి. ఆసియన్ మార్కెట్ల నుంచి సైతం సానుకూలతలు రావడం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసిందని పరిశీలకు భావిస్తున్నారు. మంగళవారం 145.83 పాయింట్ల దిగువన నమోదైన సెనె్సక్స్, 36.60 పాయింట్ల దిగువన నమొదైన నిఫ్టీ సూచీలు బుధవారం గణనీయంగా పుంజుకోవడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. సెనె్సక్స్ 403.65 పాయంట్లు (1.14 శాతం) పెరిగి, 35,756.26 పాయంట్ల వద్ద ముగియగా, నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. 131.10 పాయంట్లు (1.24 శాతం) పెరిగిన నిఫ్టీ 10,735.45 పాయంట్లకు చేరింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో బుధవారం ఓఎన్‌జీసీ, వేదాంత, యెస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, యాక్సి స బ్యాంక్, సన్‌పార్మా, ఎల్ అడ్ టీ, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ సు మారు 2.12 శాతం అదనపు లాభాలను ఆర్జించా యి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎమ్ అండ్ ఎమ్ వాటాలు సుమారు 0.76 శాతం నష్టపోయాయి. దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు దాదాపు రూ.1,163.85 కోట్ల రూపాయల విలువైన వాటాలు బుధవారం కొనుగోలు చేశారు. అలాగే విదేశీ సంస్ధాగత ఇనె్వస్టర్లు రూ.813.76 కోట్లు భారతీయ మార్కెట్లలో మదుపుచేశారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి సంబంధించిన చర్చల్లో పురోగతితోబాటు వివాదానికి తెరదించాలని ఇరు దేశాలూ నిర్ణయించడం వల్ల మార్కెట్లకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడుతున్నారు. చైనాతో వాణిజ్య చర్చలు బాగా సాగుతున్నాయని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే మార్చి ఒకటో తేదీ డెడ్‌లైన్‌ను మార్చే విషయంలో మాత్రం ఆయన తన పట్టును వీడలేదు. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే అమెరికా ఫెడరల్ రిజర్వులు ఒక రోజు వ్యవధిలో విడుదల చేయనున్న క్రమంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం జరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ మా ర్కెట్లు లాభాల్లో నడిచాయి, ఆసియాలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ 0.50 శాతం, కోస్పి 1.17 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.70 శాతం వంతున అదనంగా లాభపడగా షాంఘాయ్ కాంపోజిట్ సూచీ 0.15 నష్టపోయింది. ఇక డౌజోన్స్ పారిశ్రామిక సూచీ మాత్రం స్తబ్ధుగా 25,891.32 పాయింట్ల వద్దనే నిలిచింది. ముడిచమురు ధరలు 0.08 శాతం పెరిగి బ్యారెల్ 88.50 డాలర్లు పలికింది. రూపాయి మారకం విలువ కూడా పెరిగి డాలర్‌కు 71.31 రూపాయలైంది.