బిజినెస్

మా సంస్థలో వాటాను టేకోవర్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: రిలయన్స్ క్యాపిటల్‌లో 42.88 శాతం వాటాను టేకోవర్ చేయాలని అనిల్ అంబానీ సంస్థ నిప్పన్ జీవిత బీమా సంస్థను కోరింది. జపాన్‌కు చెందిన నిప్పన్ జీవిత బీమా కంపెనీకి ఇప్పటికే రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్‌లో 42.88 శాతం మేర వాటా ఉంది. రిలయన్‌స నిప్పన్ లైఫ్ అసెట్‌లో రిలయన్స్ కేపిటల్‌కు 42.88 శాతం వాటా ఉంది. బీఎస్‌ఈ డాటా ప్రకారం గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు రిలయన్స్ క్యాపిటల్ కు రిలయన్స్ నిప్పన్‌లో 42.9 శాతం వాటా ఉంది. కొన్ని సంస్థలను వదుల్చుకుని రుణ భారం తగ్గించుకోవాలనే యోచనలో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపు ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎరిక్‌సన్ కంపెనీకి రూ.550 కోట్ల బకాయిలు చెల్లించనందుకు సుప్రీంకోర్టు బుధవారం అనిల్ అంబానీ, మరో ఇద్దరు కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో ఎరిక్‌సన్ కంపెనీకి చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్షను కోర్టు ధిక్కారం కేసు కింద విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయం విదితమే.