బిజినెస్

రూ. 400 కోట్ల రెవెన్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేసోరాం రేయాన్‌కు చెందిన సైగ్నెట్ ఇండస్ట్రీస్ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.400 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం మీద ఉన్నత శ్రేణి సెల్యూలోజ్ కలిగి ఉన్న పారదర్శకమైన కాగితం తయారీలో కేసోరాం రేయాన్ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ బీకే బిర్లా గ్రూపులో భాగంగా ఉంది. ఆహార పదార్థాలను భద్రపరిచేందుకు, పరిరక్షించేందుకు ఇంతకాలం అల్యూమినియం కాగితాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రతి నెల 1200 మెట్రిక్ టన్నుల కాగితాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ సంస్థ్ధ కలప నుంచి ఆహార పదార్థాలను పరిరక్షించే పారదర్శకమైన కాగితాన్ని తయారు చేస్తున్నారు. ఈ కాగితాన్ని సెల్‌ఫాన్‌పేపర్ అని అంటారు. పారిశ్రామిక అవసరాలకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. పారదర్శకమైన కాగితం తయారీ రంగంలో కేసోరాం పరిశ్రమలు 1961 నుంచి ఉత్పత్తిని చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో ఈ పరిశ్రమను నెలకొల్పారు.