బిజినెస్

స్వతంత్ర రుణ యాజమాన్య సంస్థను ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రిజర్వు బ్యాంకుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే ఓ రుణ యాజమాన్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సూచించారు. ‘పబ్లిక్ డెబ్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ’(పీడీఎమ్‌ఏ) పేరిట ఏర్పాటు చేసే ఈ ఏజెన్సీ విషయాన్ని గతంలో 2015 బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారని ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రతిపాదన అమలు ఎంతో అవసరమని, ఇందువల్ల ప్రభుత్వ రుణ యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రుణ పరిమితి తగ్గించుకునేందుకు సైతం ఇది దోహదం చేస్తుందని శుక్రవారం నాడిక్కడ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రుణ వ్యవహారాలతోబాటు, మార్కెట్ లావాదేవీల బాధ్యతలను రిజర్వు బ్యాంకు నిర్వహిస్తోంది. రిజర్వుబ్యాంకు పరిధిలోని వివిధ బాధ్యతలను విడదీయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో సెంట్రల్ బ్యాంక్‌కు ప్రత్యేక స్థాయి అధికారాలివ్వాలని కేంద్రం ధైర్యంతోకూడిన నిర్ణయం తీసుకుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఇందువల్ల వృద్ధిపై ప్రత్యేక దృష్టినిలిపే వీలుంటుందన్నారు. మన దేశంలోని ఉపాధి, రుణం, ఇతర న్యాయపరమైన అంశాలపై ప్రధాన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ప్రభుత్వ బాండ్ల విషయంలో విక్రయాలు, కొనుగోళ్ల బాధ్యతలతోబాటు కీలక వడ్డీ రేట్లు నిర్ణయించే బాధ్యత ప్రస్తుతం ఆర్బీఐ పరిధిలో ఉంది. దీనిపై కొంత కాలంగా భిన్నాభిప్రాయాలు, ఘర్షణ వైఖరి తెరపైకి వస్తున్న క్రమంలో ‘పీడీఎంఏ’ ఆవశ్యకత నెలకొందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మన దేశ ఆర్థిక కొలమానాలను విస్తరించేందుకు అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు, మనదేశ అతిపెద్ద బ్యాంక్ (ఆర్బీఐ) ప్రస్తుతం ప్రపంచంలో 60వ అతిపెద్ద బ్యాంకుగా మాత్రమే ఉందని, దీనిద్వారా ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో ఆశించిన ఫలితాలు సాధించే అవకాశాలు లేవన్నారు. ఈక్రమంలో కొన్ని పెద్ద బ్యాంకులు అంతర్జాతీయ స్థాయిలో పనితీరును విస్తరించి పోటీపడి పెట్టుబడిదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి జరగాలంటే బ్యాంకులకు అదనపునిధుల ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పించాలని, లేదా మరికొన్ని విలీనాలను అమలు చేయాలని రాజీవ్‌కుమార్ సూచించారు. బ్యాంకుల మూలధన నిల్వల విషయంలో ప్రుడన్షియల్ విధానాలను అనుసరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్ట చేశారు. కంపెనీలకు కాంపిటీటివ్ రేట్లతో దీర్ఘకాలిక నిధులు సమకూర్చుకోగలిగేలా కార్పొరేట్ రుణ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. విదేశీ పెట్టుబడుల నిష్పత్తిని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.