బిజినెస్

స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: రిజర్వుబ్యాంకు తాజా విధాన నిర్ణయ సమావేశం తాలూకు మినిట్స్‌ను విడుదల చేయడంతో మదుపర్లు శుక్రవారం ఆచితూచి వ్యవహరించారు. ఈక్రమంలో దేశీయ మార్కెట్ సూచీ సెన్సెక్స్ స్వల్ప నష్టాలను చవిచూడగా, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్‌పై ఈప్రభావం కనిపించింది. 30 షేర్ల సెనె్సక్స్ 26.87 పాయింట్లు కోల్పోయి 0.07 శాతం నష్టాలతో 35,871.48 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం 1.80 పాయింట్ల స్వల్ప లాభంతో 10.791.65 వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో కోటక్ బ్యాంకు అత్యధికంగా 3.71 శాతం నష్టపోయింది. దాంతోబాటు ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ సైతం నష్టాలను చలిచూశాయి. మరోవైపు యెస్‌బ్యాంక్ దాదాపు 3.23 శాతం లాభపడింది. దీంతోబాటే వేదాంత, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, మారుతి, ఓఎన్‌జీసీ, హీరోమోటార్ కార్ప్ దాదాపు 2.86 శాతం లాభాలను గడించాయి. రంగాల వారీగా చూసే బీఎస్‌ఈ బ్యాంకెక్స్‌తోబాటు ఫైనాన్స్ సూచీలు 0.43 శాతం నష్టపోగా, విద్యుత్, వినిమయ వస్తువుల రంగాలు సైతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో లోహ, వాహన, రియాలిటీ, విద్యుత్, చమురు, గ్యాస్ రంగాల సూచీలు 1.62 శాతం లాభాలు సంతరించుకున్నాయి. కాగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.38 శాతం, స్మాల్‌క్యాప్ 0.77 శాతం వంతున లాభపడ్డాయి. కాగా అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతో ఉన్న మదుపర్లుకు రిజర్వు బ్యాంకు మానిటరీ విధాన నిర్ణయ సమావేశంతో జాగరూకతతో వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాపారులు అంటున్నారు. ఆర్బీఐ ఈ సమాశానికి సంబంధించిన మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. ద్రవ్యోల్బణం కారణంగా వారాంతపు వృద్ధిరేటు పెరగని పరిస్థితి నెలకొందని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ నోట్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈనెల తొలి వారంలో చేపట్టిన రేట్ల కోత ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో మదుపర్లు ఆచితూచి అడుగువేశారు.
రూ.202.10 కోట్ల వాటాలు కొనుగోలు చేసిన దేశీయ మదుపరులు
దేశీయ సంస్థాగత మదుపరులు గురువారం 202.10 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేయగా, విదేశీ సంస్థాగత మదుపర్లు 55.48 కోట్ల రూపాయల విలువైన వాటాలు కొన్నారు. కాగా ఆసియా మార్కెట్ల విషయానికొస్తే హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సంగ్ 0.65 శాతం, షాంఘయ్ కాంపోజిట్ సూచీ 1.91 శాతం, కొరియాకు చెందిన కోస్పి 0.08 శాతం వంతున లాభాలను సంతరించుకోగా, జపాన్‌కు చెందిన నిక్కీ 0.18 శాతం నష్టపోయింది. ఇక యూరోపియన్ మార్కెట్లలో ప్రాంక్‌ఫర్ట్ డీఏఎక్స్ 0.17 శాతం, ప్యారిస్‌కు చెందిన సీఏడీ-40 0.27 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.17 శాతం వంతున లాభపడ్డాయి.