బిజినెస్

తగ్గిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బులియన్ మార్కెట్ శుక్రవారం నష్టాలను చవిచూసింది. విదేశీ పెట్టుబడిదారులు అనాసక్తంగా వ్యవహరించడం, దేశీయ మదుపరుల నుంచి సరైన స్పందన లేకపోవడం బులియన్ మార్కెట్‌ను నిలువునా ముంచేసింది. 10 గ్రాముల పసిడి 330 రూపాయలు తగ్గి, 34,500 రూపాయలకు పతనమైంది. బంగారంతోపాటు వెండి ధరకూ పతనం తప్పలేదు. కిలో వెండి 300 రూపాయలు తగ్గడంతో, 41,360 రూపాయల వద్ద ముగిసింది. అఖిల భారత సఫారా అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) ప్రకటనను అనుసరించి, విదేశీ బులియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. ఆ ఫలితం భారత మార్కెట్‌పైనా పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర తగ్గి, 1,325.24 డాలర్లుగా ట్రేడ్ అయింది. అదే విధంగా ఔన్స్ వెండి 15.80 డాలర్లుగా నమోదైంది.