బిజినెస్

సీబీఐసీ ఆధ్వర్యంలో మూడు వర్కింగ్ గ్రూప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఎగుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు పన్నుల ఎగవేతను నిలువరించడానికి ఉద్దేశించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మూడు వర్కింగ్ గ్రూప్‌లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సె స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నియమించింది. వాణిజ్య రంగాన్ని అభివృద్ధి చేయడం, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడం, పన్ను ఎగవేతకు ఎవరూ పాల్పకుండా జాగ్రత్తలు తీ సుకోవడం వంటి అంశాలపై ఈ మూడు వర్కిం గ్ గ్రూపులు అధ్యయనం చేస్తాయి. అనంతరం ఈ దిశగా ప్రతిపాదనలు, సూలహాలు, సూచనలను సీబీఐసీకి అందచేస్తాయి. ఎగుమతులను పెంచే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా జీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రిఫండ్‌లో మో సాలను అరికట్టాల్సిన బాధ్యత కూడా సీబీఐసీ పై ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, వివిధ విభాగాలను అధ్యయనం చేసి, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, ఆతర్వాత ప్ర తిపాదనలను సిద్ధం చేస్తుంది. టారిఫ్‌నూ మార్చాలన్న ఆలోచన కూడా సీబీఐసీకి ఉన్నట్టు సమాచా రం. మొత్తం మీద ఈ వర్కింగ్ గ్రూ ప్‌లు చేయబోయే ప్రతిపాదనలు భవిష్యత్తులో భారత్ నుంచి విదేశాలకు జరిగే వివిధ వస్తుసేవల ఎగుమతుల తీరుతెన్నులను ఖరారు చేయనుంది.