బిజినెస్

చేయూతనిస్తేనే ఎగుమతుల పెంపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఎగుమతులను మరింతగా పెంచాలంటే, వివిధ వస్తుసేవలపై పన్ను, సర్‌చార్జీల మినహాయింపు తప్పనిసరి అన్న వాదన బలంగా వినిపిస్తున్నది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) కూడా జీఎస్‌టీని పూ ర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది. అదే విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎగుమతులపై సబ్సిడీని ప్రకటించాలని కోరుతున్నది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఉత్పత్తులు, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని సూచిస్తున్నది. అన్ని విధాలా చేయూతనిస్తే తప్ప ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల లక్ష్యాన్ని 375 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అదే విధంగా ఈ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేశారు. అయితే, లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించడం జరగలేదన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. 325 నుంచి 330 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగాలన్నా, కేంద్రం తప్పనిసరిగా ప్రో త్సాహకాలను అందించాలని ఈ రంగంలోని నిపుణు లు స్పష్టం చేస్తున్నారు. ద్రవ్య లబ్ధత సమస్య నుంచి ఎగుమతుల రంగం పూర్తిగా బ యటపడాలనంటే, జీఎస్‌టీని ఏకమొత్తంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ఎగుమతిదారులు చెల్లించిన జీఎస్‌టీని సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక కారణంగా జీఎస్‌టీ రిఫండ్ ఆలస్యం అవుతునే ఉంది. జీఎస్‌టీ రిఫండ్‌లో జాప్యమవుతున్న కొద్దీ ద్రవ్య లబ్ధత సమస్యలు మరింతగా పెరుగుతాయి. విదేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే, దేశీయంగా ఉత్పత్తులు పెరగాలి. వ్యవసాయం కష్టసాధ్యంగా మారుతున్న నేపథ్యంలో, ఉత్పత్తులను పెంచడం అసాధ్యంగా మారుతున్నది. కేంద్రం కల్పించుకొని, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక సబ్సిడీని ప్రకటించడంతోపాటు, ఎగుమతులపై అన్నిరకాల పన్నులను ఎత్తివేయాలి. అంతేగాక, వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచడానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఈ విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల ధోరణులను ప్రదర్శించాలి. చేయూత లేకపోతే, ఎగుమతులను పెంచడం సాధ్యం కాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 9.52 శాతం పెరిగడంతో, మొత్తం విలువ 271.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. చాలాకాలంగా 300 బిలియన్ డాలర్లకు అటూఇటుగా ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం ఏకంగా 375 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను లక్ష్యంగా ఎంచుకుంది. ఇది నెరవేరాలంటే, రత్నాలు, ఆభరణాలు, బియ్యం, చర్మం, టీ, కాఫీ, జీడిపప్పు తదితరాల ఎగుమతులు గణనీయంగా పెరగాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఎగుమతుల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదు.