బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: స్టాక్ మార్కెట్ ఈవారం కోలుకుంది. గత వారం ఎదుర్కొన్న వరుస నష్టాల ఊబి నుంచి బయటపడి, లాభాల బాట పట్టింది. వారం మొత్తం మీద సెనె్సక్స్ 62.53 పాయింట్లు పెరిగింది. మొదటి రెండు రోజులు స్టాక్స్ నష్టాల్లో ట్రేడైనప్పటికీ, ఆతర్వాత పుంజుకుంది. మొత్తం మీద బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు ఆశాజనకంగానే కనిపించాయి. గత వారం స్టాక్ మార్కెట్‌కు చివరి రోజైన శుక్రవారం 35,808.95 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్, సోమవారం దారుణంగా పతనమైంది. 310.51 పాయింట్లు నష్టపోయి, 35,498.44 పాయింట్లకు పడిపోయింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 83.45 పాయింట్లు పతనమైంది. మరుసటి రోజు, మంగళవారం కూడా ఈ పతనం కొనసాగింది. సెనె్సక్స్ 145.53 పాయింట్లు తగ్గడంతో, చివరికి 35,352.61 పాయింట్లుగా నమోదైంది. వరుసగా తొమ్మిది రోజుల మార్కెట్ పతనం ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. అయితే, బుధవారం సెనె్సక్స్ అద్భుతంగా కోలుకుంది. 403.65 పాయింట్లు ఎగబాకి, 35,756.26 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా 131.10 పాయింట్లు పెరిగింది. గురువారం, వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా లేకపోయినప్పటికీ, సెనె్సక్స్ 142.09 పాయింట్లు పెరిగింది. 35,898.35 పాయింట్లకు చేరడంతో మార్కెట్ స్థిరపడుతుందనే విశ్వాసం అటు మదుపరులకు, ఇటు స్టాక్ బ్రోకర్లకు ఊరటనిచ్చింది. నిఫ్టీ 54.40 పాయింట్లు మేర పెరిగింది. రెండు రోజుల వరుస లాభాలు, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో, సెనె్సక్స్ 26.87 పాయింట్ల పతనం తప్పలేదు. నిఫ్టీ 1.80 పాయింట్లు నష్టపోయింది. స్థూలంగా చూస్తే, ఈవారం స్టాక్ మార్కెట్ మొదటి రెండు రోజులు నష్టాల్లో, ఆతర్వాత రెండు రోజులు లాభాల్లో నడిచింది. చివరి రోజున స్వల్ప నష్టంతో ముగిసింది. అయితే, అంతర్జాతీయ పరిస్థితులు పూర్తి ప్రతికూల ధోరణులు ప్రదర్శించినప్పటికీ, భారీ నష్టాలు బీఎస్‌ఈలో నమోదు కాకపోవడం ఆశాజనకమైన అంశం. వరుస నష్టాల నుంచి కోలుకోవడమే ఈ వారం స్టాక్ మార్కెట్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి.