బిజినెస్

రొయ్యలకు రెడ్ డిసీజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, ఆగస్టు 11: డాలర్లు పండించే రొయ్యలు రైతుల్ని డీలాపడేలా చేశాయి. అంతుచిక్కని వైరస్ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఆక్వా రైతులను కుదేలుచేస్తోంది. రెడ్ డిసీజ్‌గా పిలుస్తున్న ఈ వ్యాధి గంటల వ్యవధిలోనే చెరువులోని రొయ్యలన్నిటికీ సోకి, మృత్యువాతపడుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే రెండు జిల్లాల్లో సగానికి పైగా రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. సాగుచేస్తున్న రైతులు కోట్లలో నష్టపోయారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని రొయ్యల చెరువులపై కొద్ది రోజులుగా ‘రెడ్ డిసీజ్’ వ్యాధి విస్తరిస్తోంది. ఈ వ్యాధి సోకిన రొయ్యలు ఎరుపు రంగులోకి మారి మృత్యువాతపడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే కోటి ఆశలతో రొయ్యల్ని ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా రొయ్యలను కాపాడుకోవడానికి రేయింబవళ్లు ఏరియేటర్లు, రసాయనాల ద్వారా చర్యలు చేపట్టారు. రెడ్ డిసీజ్ సోకిన చెరువులో అనూహ్యంగా గంటల వ్యవధిలోనే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. ఒక చెరువుకి వైరస్ సోకితే అక్కడి నుంచి దీని ప్రభావం మిగిలిన చెరువులకు కూడా గంటల వ్యవధిలో వ్యాపిస్తోంది. గాలి, నీరు ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. పక్షులు ఒక చెరువులో చనిపోయిన రొయ్యలను తీసుకువెళ్ళి మరొక చెరువులో వేయడంతో మరింత వేగంగా ఈ వైరస్ సోకుతోంది. ఈ వ్యాధి సోకిన చెరువులో 24 నుండి 36 గంటల వ్యవధిలో రొయ్యలన్నీ చనిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. వ్యాధి సోకినట్టు గుర్తించిన గంటల వ్యవధిలోనే రొయ్యల పట్టుబడి చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొన్ని చెరువుల్లో అయితే పట్టుబడి పట్టే అవకాశం కూడా లేకుండాపోతోందని రైతులు వాపోతున్నారు. ఇటీవల ఈ వ్యాధి సోకిన పలు చెరువుల్లోని రొయ్యలను అదే ప్రాంతంలో గోతులు తీసి పూడ్చిపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని అజ్జమూరు, పెదకాపవరం, చినకాపవరం తదితర ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లాలోని తాడినాడ, ఇవ్వరంపాడు గ్రామాల్లోని రొయ్యల చెరువులకు ఈ వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 40 శాతం చెరువులకు ఈ వ్యాధి సోకినట్టు సమాచారం.
నాణ్యత లేని సీడ్ వల్లే ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇబ్బడిముబ్బడిగా రొయ్యల హేచరీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో నాణ్యత లేని సీడ్ రావడంతో ఇటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కాకినాడ, తుని, విశాఖపట్నంతో పాటు తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు సీడ్ దిగుమతి అవుతోంది. ఈ వ్యాధి సోకిన వేలాది ఎకరాల చెరువులు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీటిని ఎండగట్టి బ్లీచింగ్‌తో పాటు రసాయనాలు చల్లిన అనంతరం మళ్లీ సాగులోకి తీసుకువస్తారు. అయితే ఇటీవల కాలంలో రెడ్ డిసీజ్ ఎక్కువగా రావడంతో రొయ్యల సాగుచేసేందుకు రైతులు భయపడుతున్నారు. ఈ చెరువుల్లో చేపల పెంపకాన్ని సాగించాలని యోచిస్తున్నారు.

చిత్రాలు.. వైరస్ సోకిన రొయ్యలు, హడావుడిగా పట్టిన రొయ్యలను ఏరుతున్న దృశ్యం