బిజినెస్

పడిపోయిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: దేశీయ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడి బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 310 తగ్గి, రూ. 33,770కి చేరుకుంది. స్థానిక వ్యాపారుల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడానికి దారితీసింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వల్ల బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 730 తగ్గి, రూ. 39,950కి చేరుకుంది. యెన్‌తో డాలర్ మారకం విలువ పది వారాల గరిష్ఠ స్థాయికి పెరగడంతో ప్రపంచ మార్కెట్‌లో బంగారం లావాదేవీల్లో బలహీనమయిన ధోరణి నెలకొందని, దాని ప్రభావం వల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ సెంటిమెంట్ దెబ్బతిన్నదని వ్యాపారులు తెలిపారు. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే న్యూయార్క్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 1.52 శాతం పడిపోయి, 1,293.90 డాలర్లకు తగ్గింది. ఒక ఔన్స్ వెండి ధర 2.47 శాతం తగ్గి, 15.29 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర శనివారం రూ. 310 తగ్గి, రూ. 33,770కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ. 310 తగ్గి, 33,600కి చేరుకుంది. క్రితం రెండు రోజుల్లో కలిసి పది గ్రాముల పసిడి ధర రూ. 570 తగ్గింది.
వారంలో పసిడి ధర రూ. 820 తగ్గుదల
దేశీయ మార్కెట్‌లో ఈ వారంలో బంగారం ధరలు పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర ఈ వారంలో రూ. 820 తగ్గి, రూ. 33,770కి చేరుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో కూడా డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా పసిడి ధరలు ఈ వారం తగ్గాయి. ఢిల్లీలో ఈ వారం వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 40వేల స్థాయికన్నా దిగువకు పడిపోయింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వల్ల వెండి ధర పడిపోయింది. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న బలహీనమయిన ధోరణి ఇక్కడి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడానికి దారితీసింది. ప్రపంచ మార్కెట్‌లో చూస్తే, న్యూయార్క్‌లో ఒక ఔన్స్ బంగారం ధర ఈ వారంలో 1,293.90 డాలర్లకు తగ్గింది. జనవరి 28వ తేదీ తరువాత బంగారం ధర ఇంత దిగువకు తగ్గడం ఇదే మొదటిసారి. న్యూయార్క్‌లో ఒక ఔన్స్ వెండి ధర ఈ వారంలో 15.29 డాలర్లకు తగ్గింది.