బిజినెస్

గట్టెక్కిన స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 2: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం జరిగిన ఐదు రోజుల వ్యాపార లావాదేవీలు లాభనష్టాల కలయికగా మారాయి. మొత్తం మీద చివరి రోజైన శుక్రవారం 196.37 పాయింట్లు లాభపడడంతో స్టాక్ మార్కెట్ గట్టెక్కెందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత వారం చివరి రోజున 35,871.48 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్, సోమవారం సుమారు 342 పాయింట్లు లాభపడి, 36,213.38 పాయింట్లకు దూసుకెళ్లింది. అయితే, ఆతర్వాత వరుసగా మూడు వరుస సెషన్స్‌లో నష్టాలను తప్పించుకోలేకపోయింది. మంగళవరాం 239.67 పాయింట్లు, బుధవారం 68.28 పాయింట్లు, గురువారం 37.99 పాయింట్లు చొప్పున పతనమైన సెనె్సక్స్ వరుసగా 35,973.71, 35,905.43, 32,370.04 పాయింట్లను నమోదు చేసింది. అయితే, మార్కెట్‌లో ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం లాభాల బాటపట్టిన సెనె్సక్స్ 36,063.81 పాయింట్లకు చేరింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు ఈవారం మొదట్లో స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన మదుపరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. నెగెటివ్ సెంటిమెంట్ బలంగా పని చేయడంతో, మూడు రోజుల పాటు నష్టాలు తప్పలేదు. అయితే, చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం, తమ వద్ద బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తామని ప్రకటించడంతో శుక్రవారం ట్రేడింగ్ ఆశాజనకమైన పరిస్థితుల్లో కొనసాగింది. ఫలితంగా మూడు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడి, లాభాలను ఆర్జించగలిగింది. మొత్తం మీద వారం రోజుల ట్రేడింగ్‌ను గమనిస్తే, భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణమే ప్రధాన భూమికను పోషించింది. ముడి చమురు ధర పెరుగడం, రూపాయి మారకపు విలువ నిలకడగా లేకపోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం సమసిపోయే మార్గాలు కనిపించకపోవడం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. అయితే, అన్నిటికంటే ఎక్కువగా భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణమే కీలకంగా వ్యవహరించింది. మొదటి రోజు, చివరి రోజు లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్, మధ్యలో మూడు రోజులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడినట్టు కనిపిస్తున్న తరుణంలో, వచ్చే వారం సానుకూల సూచీలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.