బిజినెస్

9నెలల్లో మోసపోయింది రూ. 7,951 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ. 7,951.29 కోట్ల మేరకు మోసపోయినట్టు ఆ బ్యాంకు తెలిపింది. ఈ ఖాతాలన్నీ చాలా ముందే నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మారిపోయాయని ఆ బ్యాంకు నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రంలో పేర్కొంది. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్, ఇతర యంత్రాంగాల ద్వారా ఈ బకాయిలను తిరిగి వసూలు చేయడానికి పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని ఎస్‌బీఐ వివరించింది. తొలి త్రైమాసికంలో రూ. 723.06 కోట్ల మేరకు 669 మోసపూరిత కార్యకలాపాలు, రెండో త్రైమాసికంలో రూ. 4,832.42 కోట్ల మేరకు 660 కేసులు, మూడో త్రైమాసికంలో రూ. 2,395.81 కోట్ల మేరకు 556 మోసపూరిత కార్యకలాపాలు చోటు చేసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.