బిజినెస్

లాభాలపై ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకూ తగ్గడం, అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా స్పందించడం వంటి అంశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే స్టాక్ మార్కెట్‌లో కొత్త వారం లాభాలు పండిస్తాయన్న ఆశ మదుపరుల్లోనేగాక, స్టాక్ బ్రోకర్లలోనూ ఆశలు రేపుతున్నది. గత వారం మొదటి రోజు, చివరి రోజు లాభాలు ఆర్జించిన భారత స్టాక్ మార్కెట్లు, లావాదేవీలు జరిగిన మిగతా మూడు రోజులు నష్టాలను చవిచూశాయ. భారత్, పాకిస్తాన్ దే శాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దెబ్బతిన్న తిన్న మార్కెట్ చివరి రోజైన శుక్రవారం లాభా ల్లో ముగిసింది. తమ బందీగా ఉన్న భారత ఎయర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను వి డుదల చేయడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించడమే ఇందుకు కారణం. కాగా, ఆతర్వాత చో టు చేసుకున్న పరిణామాల్లో అభినందన్‌ను పాక్ విడుదల చేసింది. అంతేగాక, మూసేసిన విమానాశ్రయా లను తిరిగి తెరిచింది. భారత్ కూడా యుద్ధంతో కాకుండా, దౌత్యపరమైన ఒత్తిళ్లను పెంచి, పాక్‌ను దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. మొత్తం మీద ఇరు దేశాల మధ్య యుద్ధ భయం కొంత వరకూ తగ్గ డంతో, స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల్లో పరుగులు తీసే అవకాశాలు చాలా ఉన్నాయ. స్థూలంగా చూస్తే, గత రెండు వారాల్లో నష్టపోయన ఎక్కువ మంది మదుపరులు కొత్త వారంపై ఆశలు పెట్టుకున్నారు. పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని నమ్ముతున్నారు. ప్రస్తుతానికి సంచలనాలు ఏవీ ఉండవన్న అభిప్రాయం వ్యక్త మవుతున్నందున, సోమవారం నుంచి స్టాక్ మార్కెట్ పుంజుకుంటుందన్న వాదన వినిపిస్తున్నది.