బిజినెస్

ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ. 17,220 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో భారత ఈక్విటీ మార్కెట్‌లో నికరంగా సుమారు రూ. 17,220 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2017 నవంబర్ తరువాత విదేశీ మదుపరులు భారత ఈక్విటీ మార్కెట్‌లో ఒక నెలలో ఇంత అధిక మొత్తంలో నికర పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ వ్యయ ప్రణాళికపై స్పష్టత రావడంతో పాటు సెంటిమెంట్ సానుకూలంగా ఉండటం విదేశీ ఇనె్వస్టర్లను ఆకర్షించింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) 2017 నవంబర్ నెలలో భారత స్టాక్ మార్కెట్‌లో నికరంగా రూ. 19,728 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీస్ నుంచి అందిన తాజా గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు భారత స్టాక్ మార్కెట్‌లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రూ. 1,17,899.79 కోట్ల పెట్టుబడులు పెట్టారు. రూ. 1,00,680.17 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. అంటే భారత స్టాక్ మార్కెట్‌లో నికరంగా రూ. 11,183 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2019 జనవరి నెలలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీ మార్కెట్లలో నుంచి నికరంగా రూ. 5,263.85 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. బడ్జెట్ తరువాత ప్రభుత్వ వ్యయంపై స్పష్టత రావడంతో పాటు అనేక రంగాల షేర్లలో విలువ ఆధారిత కొనుగోళ్లు జరగడం ఫిబ్రవరి నెలలో ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా మారడానికి ప్రధానంగా దోహదపడిందని ఫండ్స్‌ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ రీసెర్చ్ విభాగం హెడ్ విద్యాబాల పేర్కొన్నారు.