బిజినెస్

కేంద్రం నిర్ణయాలతో ఉపాధి కల్పనకు ఊతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: కేంద్ర సర్కారు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలతో ఉపాధి కల్పనకు ఊతం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో వైద్య సేవలు పొందుతున్న సమయంలో, ఆయన స్థానంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక రంగ పరిపుష్టికి, వివిధ రంగాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అంశాలను చేర్చారు. కాగా, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ ఇంత వరకూ తీసుకున్న పలు నిర్ణయాలు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఉన్నాయి. ప్రత్యేకించి, 33వ జీఎస్‌టీ కౌన్సిల్ భవన నిర్మాణాలకు సంబంధించిన కీలక తీర్మానాలను ఆమోదించింది. భవనాలపై జీఎస్‌టీని 5 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించింది. అంతేగాక, గతంలో ఉన్న 12 శాతం ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయాలు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు, ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకూ విధిస్తున్న జీఎస్‌టీ 8 శాతంకాగా, ఐటీసీ 12 శాతం. అంటే, మొత్తం మీద 20 శాతం పన్నులను చెల్లించాల్సిన నేపథ్యంలో, నిర్మాణ రంగం కుంటుపడింది. ద్రవ్య లబ్ధత ఆశించిన స్థాయిలో లేకపోవడానికి భారీగా నెత్తిన పడుతున్న పన్నులను చూసి సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఇళ్ల నిర్మాణం, అమ్మకాలు అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్లు అమ్ముడు కాకుండా నిలిచిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇప్పుడు జీఎస్‌టీని ఒక శాతానికి తగ్గించి, ఐటీసీని పూర్తిగా రద్దు చేయడంతో నిర్మాణ రంగం శర వేగంగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. రియాల్టీ, నిర్మాణ రంగాలు పరస్పర ఆధారితాలు కావడం వల్ల, రెండింటిలోనూ ఉపాధి అవకాశాలు పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. అందుకే, జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.