బిజినెస్

భారత్‌లో భారీగా దిగుమతి పన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: చాలా దేశాలతో పోలిస్తే, భారత దేశం అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు తాము కూడా స్పందిస్తామని స్పష్టం చేశారు. కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా నుంచి భారత్‌కు ఎన్నో రకాల వస్తువులు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. వీటిపై భారత్ భరించలేనంత ఎక్కువ మొత్తాల్లో పన్నులు వసూలు చేస్తున్నదని చెప్పారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, భారత్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపైనా అదే విధంగా పన్నులను విధించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నదని, ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని ట్రంప్ వివరించారు. చైనా ఇదే విధంగా దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. చైనా నుంచి దేశంలోకి వస్తున్న వస్తువులపై పన్నును కొన్ని వందల రెట్లు పెంచేసింది. దీనితో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఎప్పటికప్పుడు చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటారని అనుకుంటున్నప్పటికీ, ఇరు దేశాల అగ్రనేతలు అందుకు సిద్ధంగా లేరు. చైనాతో చర్చలకు తాము సుముఖంగా లేమని ట్రంప్ తెగేసి చెప్పారు. ముందుగా అమెరికా వస్తువులపై భారీగా పెంచిన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇప్పుడు చైనా మాదిరిగానే భారత్ కూడా ట్రంప్ ఆగ్రహానికి కారంమవుతున్నది. ‘విపరీతంగా పన్నులు వేస్తున్న దేశం భారత్. మన వస్తువులకు అక్కడి ప్రభుత్వం భారీ మొత్తాల్లో సుంకాలు వసూలు చేస్తున్నది’ అని వివరించారు. దేశీయ, ప్రపంచ మార్కెట్ తీరుతెన్నులతోపాటు, వివిధ రకాలైన వస్తుసేవల ఉత్పత్తి, సరఫరా వంటి అంశాలను కూడా ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అదే విధంగా ద్వైపాక్షిక సంబంధాలపైనా ఆయన వివరణ ఇచ్చారు. భారత్ భారీగా పన్నులు వసూలు చేస్తున్నదనడానికి హార్లే-డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్లనే ఉదాహరణగా తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఆ కంపెనీ మోటార్ సైకిళ్లపై భారత్ వంద శాతం పన్ను వసూలు చేస్తున్నదని చెప్పారు. భారత్ నుంచి తాము దిగుమతి చేసుకుంటున్న మోటార్ సైకిళ్లపై అసలు పన్నులే విధించడం లేదని పేర్కొన్నారు. భారత్ అనేకానేక వస్తుసేవలపై ఏ విధంగా సుంకాలు వసూలు చేస్తున్నదో దీనిని బట్టి ఊహించుకోవచ్చని తెలిపారు. ‘మనం కూడా స్పందించాల్సిందేనని మిత్రులు కోరుతున్నారు. పరస్పర ఇచ్చిపుచ్చుకునే ధోరణలో సంబంధాలు ఉండాలి. అంతేగానీ, మనకు ఒక న్యాయం, వారికి ఒక న్యాయం ఉండకూడదు’ అంటూ, భవిష్యత్తులో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీగానే పన్నులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు పంపారు.