బిజినెస్

లాభాల పరుగులో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 5: వాహన, ఫైనాన్షియల్, విద్యుత్ కౌంటర్లలో వాటాల కొనుగోళ్లు భారీగా జరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు అందుకున్నాయి. సెనె్సక్స్ 378.73 పాయింట్లు ఎగబాకి 36,442.54 మార్కును తాకింది. ఇక నిఫ్టీ సైతం 123.95 పాయింట్లు లాభపడి 10,987.45 పాయంట్లకు చేరింది. సెనె్సక్స్ విభాగంలో సుమారు 23 స్టాక్స్ లాభపడగా, ఏడు కౌంటర్లు నష్టపోయాయి. సెనె్సక్స్ చార్ట్‌లో టాటా మోటార్స్ 7.72 శాతం లాభాలతో అగ్రస్థానంలో నిలవగా, హీరో మోటోకార్ప్ 5.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.12 శాతం వంతున లాభాలను సంతరించుకున్నాయి. అలాగే ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఎన్‌పీటీసీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు దాదాపు 3.96 శాతం లాభపడ్డాయి. ఇక సెనె్సక్స్‌లో అధికంగా నష్టపోయిన సంస్థల్లో ఇన్ఫోసిస్ 1.15 శాతం, హెచ్‌యూఎల్ 0.62 శాతం, టీసీఎస్ 0.19 శాతం ఉన్నాయి. గత ఫిబ్రవరిలో సేవా రంగాలు సరికొత్త వర్క్ ఆర్డర్లతో అభివృద్ధి పథంలోకి వచ్చాయని, మంచి ఉపాధి అవకాశాలు సైతం నెలకొన్నాయన్న నెలవారీ సర్వేనివేదికలు మంగళవారం విడుదలైన క్రమంలో నిక్కీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ 52.2 నుంచి 52,5 శాతానికి పెరగడం స్టాక్ మార్కెట్లకు ఊతంగా మారింది. అలాగే భారత-పాక్ సరిహద్దు టెన్షన్ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించిన మదుపర్లు సైతం ప్రస్తుతం సానుకూలంగా స్పందిస్తున్నారు. కాగా మరోవైపు మదుపర్ల వ్యూహం మారడంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ సైతం ఏడాది తర్వాత లాభాల్లోకి వచ్చాయి. సెనె్సక్స్ ఉదయం సానుకూలంగానే ఆరంభమై 36.141.07 మార్కుకు ఆ తర్వాత 36,457.44 మార్కుకు ఎగబాకింది. ఒక దశలో 35,926,94కి దిగివచ్చింది. ఇలా ఇంట్రాడేలో హెచ్చుతగ్గులు నమోదైనా ఆఖరుకు 530 పాయింట్లు లాభపడింది. అలాగే నిఫ్టీ సైతం 10,864.85 పాయింట్ల వద్ద ఆరంభమై 10,994.90 మార్కును తాకి మళ్లీ 10,817కు దిగివచ్చింది. చివరిగా 177 పాయింట్లు లాభపడింది.
ఆసియన్ మార్కెట్లకు మిశ్రమ ఫలితాలు
కాగా ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమ ఫలితాలు పొందాయి. చైనా ముప్పై ఏళ్లలో అతితక్కువ స్థాయి వృద్ధిరేటును 6 నుంచి 6.50గా ప్రకటించడంతో అమెరికన్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. అలాగే విదేశీ మదుపర్లు సైతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలను సైతం పరిగణనలోకి తీసుకుని జాగరూకతతో వ్యవహరించారు. ఇక అంతర్జాతీయంగా సైతం ఇనె్వస్టర్లు సైతం నష్టాలను చవిచూశారు. కారణం ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య శక్తులైన అమెరికా-చైనా ఓ వైపు వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపుప్రతి ఒప్పందంపై స్పష్టత ఉండేలా చూడాలని నిర్ణయించుకోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియాలో షాంఘయ్, హాంగ్‌కాంగ్, టోక్యో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.