బిజినెస్

పెద్దగా ప్రభావం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఎగుమతి సుంకపు రాయితీల ఎత్తివేత నిర్ణయం వల్ల మన దేశపు ఎగుమతులపై ఎలాంటిపై ప్రభావం ఉండబోదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడిక్కడ స్పష్టం చేసింది. ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెనె్సస్ (జీఎస్‌పీ) పథకం కింద కొన్ని ఉత్పత్తులపై అమెరికా ఎగుమతుల సుంకంపై ఇప్పటి వరకు రాయితీలు వచ్చేవి. ఐతే ఈ రాయితీలు కేవలం ఏడాదికి 190 మిలియన్ల అమెరికన్ డాలర్లు మాత్రమేనని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వధావన్ స్పష్టం చేశారు. భారత్, టర్కీ దేశాలు వాటి మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులను సమాన స్థాయిలో సహేతుకంగా అనుమతించడం లేదని, అందువల్ల ఆ రెండు దేశాలకు దిగుమతి పరంగా ఇస్తున్న వాణిజ్య ప్రాధాన్యతా హోదాను వెనక్కు తీసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ భారత్ మాత్రం మరింత విస్తరణతో కూడిన సహేతుకమైన వాణిజ్య ప్యాకేజీ కోసం కృషి చేస్తోందని, ఇందుకు సంబంధించి చర్చలకు కూడా సిద్ధమేనని అనూప్ తెలిపారు. అమెరికా మాత్రం 60 రోజుల వ్యవధిలో వాణిజ్య ప్రాధాన్యతా ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆయన చెప్పారు. ఈ ప్యాకేజీలో అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు చెందిన వైద్య పరికరాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు వంటి దిగుమతులు ఉన్నాయని వివరించారు. ఆరోగ్య రక్షణ అంశాలపై భారత్ ఎలాంటి రాజీదోరణిని అనుసరించబోదని తెలిపారు. గత ఏడాది భారత్ దాదాపు 5.6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను జీఎస్‌పీ పథకం ద్వారా అమెరికాకు ఎగుమతులు చేసిందన్నారు. మనకు అమెరికా ఇస్తున్న జీఎస్‌పీ ప్రయోజనాలు మొత్తం 190 మిలియన్ డాలర్లు మాత్రమేనని అనూప్ చెప్పారు. వాస్తవానికి ఈ ప్రయోజనాలు జరిగిన మొత్తం ఎగుమతులపై అతిస్వల్ప స్థాయిలో లాంఛనంగా మాత్రమే ఉన్నాయన్నారు. ఈ ప్రయోజనాలేవీ పరస్పరం ఇచ్చిపుచ్చుకునేవి కావని, అలాగే పక్షపాత రహితమైనవని, అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధికి ఇచ్చే చేయూత అని అనూప్ స్పష్టం చేశారు. వైద్య పరికరాలు, పాల ఉత్పత్తుల దిగుమతుల విషయంలో అమెరికా డిమాండ్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ దీనిపై ఒక సహేతుకమైన పరిష్కారాన్ని భారత్ కోరుకుంటోందన్నారు. అయితే అది మనదేశ ప్రజారోగ్య సంబంధ ఆవశ్యకతపై సంప్రదింపుల రహితంగా ఉంటుందన్నారు. అలాగే పాల ఉత్పత్తులకు సంబంధించి కూడా మనదేశానికి మతపరమైన, సాంస్కృతిక పరమైన అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి జంతు అవశేషాలకు సంబంధించిన ఎలాంటి కల్తీ లేదన్న నిర్ధిష్టమైన సర్ట్ఫికేట్లు వంటివి ఆ పాల ఉత్పత్తులకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో భారత్ రాజీపడే ప్రశే్న లేదన్నారు. మనదేశానికి ఈ ఉత్పత్తుల ఆవశ్యకత ఎంతవుంది, ధరల పరంగా మన నియంత్రణ పరిధిలోకి వస్తాయా లేదా అన్న అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆమేరకే అమెరికా సరఫరాదారుడి నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని అనూప్ వధావన్ వివరించారు. అలాగే వైద్య పరికరాలైన స్టెంట్‌లు అధిక ధరలు పలుకుతున్నాయన్నారు. వీటిపై మన దేశం నియంత్రణ విధించినా అమెరికన్ సరఫరాదారు ధరలు తగ్గించలేదన్నారు. ఈక్రమంలో గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా తన ఎగుమతులైన పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, జీఎస్‌పీ ప్రయోజనాలకు సంబంధించి సమీక్ష నిర్వహించింది.