బిజినెస్

అమ్మకానికి నయాగన్ సిమెంట్ ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రస్తుతం వాడుకలో లేని నయాగన్ సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్‌ను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించామని, దీనికి ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నామ ని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) ప్రకటించింది. జాయింట్ వెంచర్స్‌గా గాని, కన్సార్టియంగా గాని 2017-18 ఆర్థిక సంవత్సరంలో 200 కోట్ల వ్యాపారం చేసిన వారు గాని, అంత విలువైన ఆస్తులు కలిగి ఉన్న వారు గాని త మ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఎల్)ను ఏప్రిల్ 16లోగా తమకు సమర్పించాలని సీసీఐఎల్ కోరింది. మధ్యప్రదేశ్‌లోని నయాగన్‌లో ఉన్న తమ యూనిట్ 1997, జూన్ 30 నుంచి వాడుకలో లేదని, దీనికి సంబంధించి నయాగన్ మైన్‌కు లీజు ఒప్పందం 2024, ఫిబ్రవరి 15 వరకు, కేరా రాథోర్ మైన్ లీజ్ ఒప్పందం 2031 వరకు ఉందన్నారు. నయాగన్ సి మెంట్ ఫ్యాక్టరీకి 2018 మార్చి 31తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరానికి 27.3 కోట్ల అప్పులు, అదే సా థయిలో ఆస్తులు ఉన్నాయన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా వా డుకలో లేని యూనిట్లను అమ్మకానికి ఉంచుతున్న ట్టు ప్రకటించింది. సిమెంట్ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించే లక్ష్యంతో 1965లో ఏర్పాటు చేసిన సీసీఐఎల్ ఆధ్వర్యంలో వంద యూనిట్లు నడుస్తున్నాయి. నూరు శాతం ప్రభుత్వరంగ పెట్టుబడుల తో కొనసాగుతున్న ఈ సంస్థ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్‌భన్, అసోంలోని బొకాజన్, తెలంగాణలోని తాండూరులలో సిమెంట్ యూనిట్లు ఉన్నాయి. ఇటీవలే సీసీఐఎల్ తెలంగాణలోని ఆదిలాబాద్, మధ్యప్రదేశ్‌లోని నయాగాన్, చత్తీస్‌గఢ్‌లోని మందార్‌లోని యూనిట్లను మూసివేసింది.