బిజినెస్

మూడోరోజూ లాభాల బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 6: వరుసగా మూడో రోజైన బుధవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాటపట్టాయి. వాటాల కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడం ఊతమిచ్చింది. ప్రధానంగా ఫైనాన్స్, లోహ, విద్యుత్ కౌంటర్లలో అధికంగా వాటాల కొనుగోళ్లు జరగాయి. సెనె్సక్స్ 193.56 పాయింట్లు ఎగబాకి 36,636.10 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 65.55 పాయింట్ల లాభంతో 11,000 మార్కును దాటింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు నెలకొన్న భారత-పాకిస్తాన్ సరిహద్దు టెన్షన్ సమసిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. సెనె్సక్స్ ప్యాక్‌లో 17 స్టాక్స్ లాభపడగా, 13 కౌంటర్లలో నష్టాలు నమోదయ్యాయి. ప్రధానంగా 30 షేర్ల సూచీ సెనె్సక్స్ గత మూడు రోజులుగా మొత్తం 768 పాయింట్లు లాభపడటం గమనార్హం. బజాజ్ ఫైనాన్స్ 2.60 శాతం లాభాలతో బుధవారం అత్యధిక లాభాలు సంతరించుకున్న సంస్థగా నిలిచింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు 2.55 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2.15 శాతం లాభపడ్డాయి. అలాగే ఈ బిఎస్‌ఈ గేజ్‌లో వేదాంత, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌పీటీసీ, ఐటీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఎల్‌టీ, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ దాదాపు 2 శాతం లాభాలను ఆర్జించాయ.
అధికంగా నష్టపోయిన టాటామోటార్స్
టాటామోటార్స్ బుధవారం అత్యధికంగా 2.81 శాతం నష్టపోయిన సంస్థగా నిలిచింది. ఇక ఆక్సిస్ బ్యాంక్ 1.72 శాతం, హెచ్‌యూఎల్ 1.38 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.24 శాతం, హీరోమోటో 0.96 శాతం వంతున నష్టపోయాయి. కాగా బుధవారం సెనె్సక్స్ సానుకూల వాతావరణంలో 36,544.86 వద్ద ఆరంభమై 36,666.47 మార్కును తాకింది. ఆ తర్వాత ఆఖరి గంటల్లో 36,456.82కు దిగివచ్చింది. ఇలా ఇంట్రాడేలో హెచ్చుతగ్గులు నమోదై చివరకు 193.56 పాయింట్ల లాభంతో 36,636.10 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 11,062.30 వద్ద ఆరంభమై 11,062.30 మార్కును తాకింది.
ఆ తర్వాత 10,998.85కి దిగివచ్చి చివరకు 65 పాయింట్ల లాభంతో 11,053 వద్ద స్థిరపడింది. మొత్తానికి గత కొన్ని సెషన్ల నుంచి మిడ్ అండ్ స్మాల్ కాప్స్ లాభాల బాటలోకి రావడం గమనించదగ్గ అంశం. ప్రభుత్వ ఆర్థికాభివృద్థి గణాంకాలు అధికంగా ఉండే అవకాశాలున్నాయన్న కథనాలు మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేశాయంటున్నారు.
ఆర్థికాభివృద్ధి కారణంగా నిర్థిష్టమైన విధాన నిర్ణయాలుంటాయని మదుపర్లు అంచనావేసి పెట్టుబడులకు ముందుకొస్తున్నారని ఓ మార్కెట్ విశే్లషణ వెల్లడించింది.
మళ్లీ లాభాల్లోకి ఆసియన్ మార్కెట్లు
అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల ప్రగతిపూర్వక సంకేతాలు రావడంతో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. షాంఘయ్ కాంపోజిట్ సూచీ 0.9 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.2 శాతం లాభపడగా, జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రం 0.54 శాతం నష్టపోయింది.