బిజినెస్

ఐసీఎఫ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చెన్నైలోని ది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక కోచ్‌లను తయారు చేసిన సంస్థగా గుర్తింపు పొందింది. గత నెల ఐసీఎఫ్ 301 కోచ్‌లను తయారు చేసింది. దీనితో ఇక్కడ ఉత్పత్తయిన కోచ్‌ల సంఖ్య 2,919కి చేరింది. దీనితో రైల్‌కార్ తయారీలో, ప్రపంచంలోని మిగతా కోచ్ ఫ్యాక్టరీలను వెనక్కునెట్టి, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. చైనాలోని కోచ్ ఫ్యాక్టరీ ఏడాదికి 2,600 కోచ్‌లను తయారు చేస్తున్నట్టు ప్రకటించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 2,085 కోచ్‌లను చైనా తయారు చేయగా, అదే కాలానికి ఐసీఎఫ్ తయారు చేసిన కోచ్‌ల సంఖ్య 2,919 కావడం విశేషం. సంవత్సర కాలంలో ఈ ఫ్యాక్టరీ తన ఉత్పత్తిని 40 శాతం పెంచుకుంది. ప్రపంచ రికార్డును సృష్టించింది.